roelant oltmans
-
కోచ్ ఓల్ట్‌మన్స్‌కు ఉద్వాసన
హాకీ ఇండియా అనూహ్య నిర్ణయం న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌ను హాకీ ఇండియా (హెచ్ఐ) ఉన్నపళంగా తప్పించింది. హై పెర్ఫార్మెన్స్, డెవలప్మెంట్ కమిటీ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కోచ్‌ను తప్పిస్తున్నట్లు హెచ్ఐ వెల్లడించింది. హాకీ జట్టు ఇంటా బయటా ఆశించిన ఫలితాలు సాధించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. పూర్తిస్థాయి కోచ్ నియామకం జరిగే వరకు ఆయన సీనియర్ జట్టు కోచ్‌గా పనిచేస్తారని హెచ్ఐ తెలిపింది. హాలెండ్‌కు చెందిన ఓల్ట్‌మన్స్ తొలుత 2013లో హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా చేరారు. అనంతరం 2015 జూలైలో కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన మార్గదర్శనంలోనే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రజతం సాధించింది. జూనియర్ జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. అయితే అజ్లాన్ షా, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ ఈవెంట్లలో భారత్ తమ కన్నా తక్కువ ర్యాంకు ఉన్న మలేసియా, కెనడా జట్ల చేతిలో ఓడటం హెచ్ఐ ఉన్నతాధికారులను అసంతృప్తి పరిచింది. -
రియోలో వసతిపై భారత హాకీ జట్టు ఫిర్యాదు
రియో డి జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగనున్న రియోలో వసతులు దయనీయంగా ఉన్నాయంటూ భారత హాకీ జట్టు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్ విలేజ్‌లో తాము బస చేసే చోట కనీసం కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేవని భారత చీఫ్ కోచ్ ఓల్ట్‌మన్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆటగాళ్లు ఉండే అపార్ట్మెంట్లలో ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు రియోలో భారత వ్యవహారాలను పర్యవేక్షించే రాకేశ్ గుప్తాకు లేఖలో తెలియజేశారు. 'మాకు ఇంకా పూర్తికాని అపార్ట్మెంట్లు కేటాయించారు. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా లేవు. దాంతో పాటు తగినన్ని టీవీ సెట్లు కూడా లేవు. పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళా క్రీడాకారిణులు పరిస్థితి ఇలానే ఉంది . సరైన టేబుల్స్ కూడా లేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది అపార్ట్మెంట్లలో ఉంటున్న పురుష, మహిళా హాకీ జట్లకు ఇంకా 28 కుర్చీలు అవసరమని పేర్కొన్నారు. దాదాపు ఏడు అపార్ట్మెంట్లలో కనీసం ఒక్కో టేబుల్ ను అమర్చడంతో పాటు, ఒలింపిక్స్ గేమ్స్ జరిగే సమయంలో మ్యాచ్‌లను చూడటానికి కూడా తగినన్ని టీవీ సెట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల ఆట తీరును తెలుసుకోవడానికి టీవీలు దోహదం చేస్తాయన్నారు. తమ అభ్యర్థనను సాధ్యమైనంత తొందరగా అమలు చేయడానికి యత్నించాలని విన్నవించారు. -
భారత హాకీ జట్టు కోచ్‌గా ఓల్ట్‌మన్స్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా రోలెంట్ ఓల్ట్‌మన్స్‌ను నియమించారు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్‌గా ఉన్న ఓల్ట్‌మన్స్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించినట్టు హాకీ ఇండియా ప్రకటించింది. భారత హాకీ కోచ్ పాల్ వాన్‌ను హాకీ ఇండియా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో నియామకం చేపట్టారు. హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రా కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసన్‌తో సమావేశమయ్యారు. అనంతరం కొత్త కోచ్‌ను నియమిస్తున్నట్టు చెప్పారు. -
వాల్ష్ వైదొలిగితే హాకీ ఇండియాకు కష్టాలు తప్పవు!
న్యూఢిల్లీ:హాకీ ఇండియా చీఫ్ కోచ్ గా ఉన్న టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకుంటే జట్టు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హాకీ ఇండియా పాలనా అధికారి రోలెంట్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే తాను వైదొలుగుతానని వాల్ష్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆల్ట్‌మన్ పై విధంగా స్పందించారు. 2016 రియోలో జరిగే ఒలింపిక్స్ కు వాల్స్ కోచ్ గా ఉంటే హాకీ ఇండియాకు మేలు జరుగుతుందన్నాడు. ఒకవేళ వాల్ష్ వెళ్లిపోతే మాత్రమ కష్టాలు తప్పవని స్పష్టం చేశాడు. ఈ మధ్య దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత జట్టు స్వర్ణం సాధించి 16 ఏళ్ల చరిత్రను తిరరాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తాను ఏమిటో వాల్ష్ నిరూపించుకున్నాడని, తదుపరి ఒలింపిక్స్ కు అతను చీఫ్ కోచ్ గా లేకపోతే ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. -
మానసిక నిపుణుడు కావాలి
న్యూఢిల్లీ: పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు భారత హాకీ జట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, దీనికి పరిష్కారంగా వెంటనే ఓ మానసిక నిపుణుడిని నియమించాలని సీనియర్ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కోరాడు. ఇటీవల ముగిసిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత ఆటగాళ్ల ఆటతీరును గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుందని అన్నాడు. ‘వీలైనంత త్వరగా జట్టుతో పాటు మానసిక నిపుణుడు ఉండాలని నేను భావిస్తున్నాను. ఇప్పటికే దీని గురించి హాకీ ఇండియా హై పెర్ఫార్మెమెన్స్ డెరైక్టర్ రోలంట్ ఓల్ట్మన్స్తో చర్చించాం. జూనియర్ ప్రపంచకప్‌లో భారత మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆటగాళ్లు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించారు. సొంత అభిమానుల ముందు ఆడే సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని వారు అధిగమించడంలో విఫలమయ్యారు. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌కు ముందుగానే సైకాలజిస్ట్ సేవలు మాకు అందుతాయని ఆశిస్తున్నాను’ అని సర్దార్ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ వేదిక భువనేశ్వర్ వచ్చే ఏడాది డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరిగే పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీ భువనేశ్వర్‌లో జరుగనుంది. ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉన్న కళింగ స్టేడియంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు చెందిన ఈ టోర్నీ జరుగుతుందని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఢిల్లీలో ముగిసిన జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీకి అభిమానులు స్వల్ప సంఖ్యలో రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆయన ఆరోపించారు. చివరి నిమిషంలో అనుమతి ఇవ్వడంతో కేవలం వారం రోజుల ముందుగా టిక్కెట్లు అమ్మగలిగామని చెప్పారు.