
1975 ప్రపంచకప్ హీరోలకు సన్మానం
భారత్‌కు హాకీ ప్రపంచకప్ అందించిన ఆటగాళ్లను హాకీ ఇండియా ఎట్టకేలకు సన్మానించింది. ఇప్పటిదాకా భారత్ ఒకే ఒక్కసారి 1975లో ప్రపంచకప్ గెలిచింది. అయితే మనదేశానికి ఈ ఘనతను అందించిన ఆటగాళ్లను ఇన్నాళ్లూ మరచిపోయారు.
ఇన్నాళ్లకు జట్టులోని 16 మంది ఆటగాళ్లను సన్మానించడమే కాకుండా వారికి రూ. 1.75 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా అందజేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రస్తుత ఆటగాళ్లు, హాకీ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచకప్ విజేతలతో పాటు ప్రస్తుత భారత జట్టు సభ్యులు కలిసి గ్రూప్ ఫోటో దిగారు.