న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య జాతీయ జట్టులో పునరాగమనం చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా కప్ మహిళల టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఆమె ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో కొనసాగనుంది.
మొత్తం 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రీతూ రాణి నాయకత్వం వహిస్తుంది. చన్‌చన్ దేవి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసియా టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈనెల 21న హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ టోర్నీని ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచకప్‌కు దీనిని అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు.
ఆసియా కప్ హాకీ టోర్నీకి సౌందర్య, రజని
Published Sat, Sep 7 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement