నికోల్‌ సెంచరీ | Australia beat West Indies by eight wickets at Women's Cricket World | Sakshi
Sakshi News home page

నికోల్‌ సెంచరీ

Published Tue, Jun 27 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

నికోల్‌ సెంచరీ

నికోల్‌ సెంచరీ

టాంటన్‌: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. ఆసీస్‌ ఓపెనర్‌ నికోల్‌ బోల్టన్‌ (116 బంతుల్లో 107 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ మహిళల జట్టు 47.5 ఓవర్లలో 204 పరుగుల వద్ద ఆలౌటైంది. హేలీ మాథ్యూస్‌ (63 బంతుల్లో 46; 7 ఫోర్లు), కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (57 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు.

చెదిన్‌ నాషన్‌ 39, డియాండ్ర డాటిన్‌ 29 పరుగులు చేశారు. ఒక దశలో 161/4 స్కోరుతో పటిష్టంగా కనిపించిన విండీస్‌ అనూహ్యంగా 43 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్‌ బౌలర్లలో ఎలైస్‌ పెర్రీ 3, జెస్‌ జొనసెన్, క్రిస్టెన్‌ బీమ్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 38.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు నికోల్, బెథ్‌ మూనీ (85 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఆసీస్‌ విజయం సులువైంది. విండీస్‌ బౌలర్‌ స్టెఫానీ టేలర్‌ 2 వికెట్లు తీసింది.  మంగళవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ ఆడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement