
కెప్టెన్‌గా మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. వచ్చే నెల 24 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇందులో మిథాలీరాజ్‌కే జట్టు పగ్గాలు అప్పజెబుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2005లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది.
అదే ఇప్పటికీ భారత మహిళల అత్యుత్తమ ప్రదర్శన. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పునమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్ యాదవ్, నుజ్‌హత్ పార్వీన్, స్మృతీ మందనా.