డెర్బీ: మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరగాల్సిన ఉన్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. డెర్బీలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒకవేళ వరుణుడు తెరిపిస్తే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాని పక్షంలో రిజర్వ్ డే అయిన శుక్రవారం మ్యాచ్ జరుగనుంది.
ఇప్పటికే ఇంగ్లండ్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నసంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ గెలిచి తుది బెర్తును ఖాయం చేసుకుంది.ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సెమీస్లో విజేతతో ఇంగ్లండ్ తలపడనుంది.
రెండో సెమీస్కు వర్షం అడ్డంకి
Published Thu, Jul 20 2017 3:32 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
Advertisement
Advertisement