పాకిస్తాన్‌కు ఐదో ఓటమి | South Africa, India, New Zealand in race for semi-final spots | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఐదో ఓటమి

Published Sun, Jul 9 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

పాకిస్తాన్‌కు ఐదో ఓటమి

పాకిస్తాన్‌కు ఐదో ఓటమి

టాంటన్‌: మహిళల ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ మళ్లీ ఓడింది. న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌పై గెలుపొందింది. మొదట పాకిస్తాన్‌ 46.5 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ సనా మీర్‌ (50) ఒంటరి పోరాటం చేయగా, కివీస్‌ బౌలర్లలో హన్నా రో 3, తహుహు, కాస్పెరెక్, కెర్‌ తలా 2 వికెట్లు తీశారు.

తర్వాత న్యూజిలాండ్‌ కేవలం 15 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి గెలిచింది. సోఫి డెవిన్‌ (41 బంతుల్లో 93; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వరుసగా ఐదో ఓటమితో పాకిస్తాన్‌ సెమీస్‌ రేసు నుంచి వైదొలిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement