'భవిష్యత్ మన మహిళా క్రికెట్దే' | ICC Women's World Cup 2017: India will achieve new heights in future, says Vijay Goel | Sakshi
Sakshi News home page

'భవిష్యత్ మన మహిళా క్రికెట్దే'

Published Mon, Jul 24 2017 3:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

'భవిష్యత్ మన మహిళా క్రికెట్దే'

'భవిష్యత్ మన మహిళా క్రికెట్దే'

న్యూఢిల్లీ:భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ అద్భుతాల్ని సాధించడం ఖాయమంటున్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. మహిళల వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ ను మంత్రి గోయల్ అభినందించారు. మహిళా భారత క్రికెట్ జట్టు కొత్త ఎత్తుల్ని అధిరోహించే సమయం ఎంతో దూరంలో లేదని గోయల్ పేర్కొన్నారు.

'వన్డే వరల్డ్ కప్ లో భారతమాత కూతుళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్లో ఓడినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. మన మహిళలు తుదిపోరుకు చేరిన క్రమం అద్వితీయం. తుదిపోరులో పోరాడి ఓడారు.. అయినా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇది భారత మహిళా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది. మన మహిళలకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని గోయల్ పేర్కొన్నారు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ పోరులో భారత మహిళలు 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement