FIFA Under-17: అమెరికా చేతిలో భారత్‌ ఘోర పరాభవం | USA Hammered India 8-0 FIFA Under-17 Women World Cup | Sakshi
Sakshi News home page

FIFA Under-17: అమెరికా చేతిలో భారత్‌ ఘోర పరాభవం

Oct 12 2022 9:40 AM | Updated on Oct 12 2022 9:40 AM

USA Hammered India 8-0 FIFA Under-17 Women World Cup - Sakshi

భువనేశ్వర్‌: ప్రపంచ అండర్‌–17 మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ఆతిథ్య భారత్‌ పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 0–8 గోల్స్‌ తేడాతో 2008 రన్నరప్‌ అమెరికా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అమెరికా తరఫున మెలీనా రెబింబాస్‌ (9వ, 31వ ని.లో) రెండు గోల్స్‌ చేసింది.

ఆ తర్వాత చార్లోటి కోలెర్‌ (15వ ని.లో), ఒన్‌యెకా గమెరో (23వ ని.లో), గిసెలీ థాంప్సన్‌ (39వ ని.లో), ఎల్లా ఇమ్రి (51వ ని.లో), టేలర్‌ స్వారెజ్‌ (59వ ని.లో), మియా భుటా (62వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. మరో మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1–0తో మొరాకోపై  నెగ్గింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను 14న మొరాకోతో ఆడుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement