1993 తర్వాత ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు 1993 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేయగా... అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో విండీస్ 47 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది.