అర్ధశతకాలతో రాణించిన దీప్తీ, మిథాలీ..
► 5 వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన
డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీసేన 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంబాన్ని అందించకపోవడంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు జట్టు బాధ్యతలు మీదేసుకున్నారు. విరీద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు 200 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది.
అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) వచ్చి రావడంతోనే బంతిని గాల్లోకి లేపింది. ఒక లైఫ్ వచ్చిన ఆమె అలానే ఆడుతనూ రణవీర బౌలింగ్ లో వెనుదిరిగింది. ఆ మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే వికెట్లు కోల్పోయింది. క్రీజులో కృష్ణమూర్తి(7), హర్మన్ ప్రిత్ కౌర్ (6) పోరాడుతున్నారు.