భారత్‌xదక్షిణాఫ్రికా | India will host World Women's World Cup in London next year | Sakshi
Sakshi News home page

భారత్‌xదక్షిణాఫ్రికా

Published Sat, Jul 8 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

India will host World Women's World Cup in London next year

జొహన్నెస్‌బర్గ్‌: వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగా... శనివారం మొదలయ్యే హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నీలో భారత్‌ బరిలోకి దిగనుంది.

పూల్‌ ‘బి’లో ఉన్న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌ తర్వాత భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా అమెరికా (10న), చిలీ (12న), అర్జెంటీనా (16న) జట్లతో తలపడుతుంది. పూల్‌ ‘ఎ’లో మరో ఐదు జట్లున్నాయి. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన జట్లు ఈ ఏడాది నవంబరులో  జరిగే హెచ్‌డబ్ల్యూఎల్‌ ఫైనల్స్‌ టోర్నీకి... వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ కప్‌ పోటీలకు అర్హత పొందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement