రాణించిన మిథాలీ | Women's World Cup: India captain Mithali Raj stars in warm-up win over Sri Lanka | Sakshi
Sakshi News home page

రాణించిన మిథాలీ

Published Thu, Jun 22 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

రాణించిన మిథాలీ

రాణించిన మిథాలీ

వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు
చెస్టెర్‌ఫీల్డ్‌: మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ సన్నాహాల్లో బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లో భారత జట్టు 109 పరుగుల తేడాతో గెలిచింది. మొదట  భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. హైదరాబాద్‌ అమ్మాయి, కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (89 బంతుల్లో 85; 11 ఫోర్లు), పూనమ్‌ రౌత్‌ (79 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత  శ్రీలంక 48.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్‌ రాజేశ్వరి (4/12) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ తలవంచారు. శిఖా పాండే 2 వికెట్లు తీసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement