మరో విజయంపై భారత్ దృష్టి | indian womes won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

మరో విజయంపై భారత్ దృష్టి

Published Thu, Jun 29 2017 3:12 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

indian womes won the toss and elected to field first

టాంటన్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ తొలుత విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇది భారత్ కు రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు మరో విజయంపై కన్నేసింది.

 

అయితే వెస్టిండీస్ కూడా పటిష్టమైన జట్టే కావడంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. గత వన్డే ప్రపంచకప్ రన్నరప్, టీ 20 ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ తో ఏమాత్రం ఆదమరిచినా భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

విండీస్ తుది జట్టు: స్టెఫానీ టేలర్(కెప్టెన్), హేలే మాథ్యూస్, వాల్టర్స్, డాటిన్, అగ్విల్లెరా, ఐషోనా ఏ నైట్, చెడియన్ నేషన్, డాలే, ఏఎస్ఎస్ ఫ్లెచర్, అనిషా మొహ్మద్, ఎస్ఎస్ కానెల్

భారత్ తుది జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), మందనా, పూనమ్ రౌత్, హర్మన్ కౌర్, దీప్తి శర్మ, మెష్రామ్, శిఖా పాండే, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, సుష్మా వర్మ పూనమ్ యాదవ్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement