
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 31/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన లంకను ఆరంభంలోనే బర్త్‌డే బాయ్ రవీంద్ర జడేజా దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఏంజెలో మాథ్యూస్(1)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు చేర్చాడు.
మాథ్యూస్ బ్యాట్‌కు తగిలిన బంతి స్లిప్ వైపు దూసుకురాగా రహానే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ చండిమాల్‌తో డిసిల్వా(24) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇక (డిసెంబర్ 6) నేడు 29వ బర్త్‌డే జరుపుకుంటున్న జడేజా.. నాలుగో రోజు చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment