బిగ్ క్రికెట్ లీగ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు.
SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024
ధవన్‌కు జతగా మరో ఎండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్‌కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.
పరుగుల వరద పారిస్తున్న ధవన్
బిగ్ క్రికెట్ లీగ్‌లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్‌లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్‌లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానులను అలరించాడు.
Comments
Please login to add a commentAdd a comment