భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్‌పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.
శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్‌లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్‌లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి.
అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్‌సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్‌లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్.
డైట్..
గబ్బర్‌గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు.
ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడు
ప్రోటీన్ రిచ్ డైట్‌కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.
అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.
(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్‌ని బట్టి..)
Comments
Please login to add a commentAdd a comment