మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్‌గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్‌నెస్ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!
యోగా..
యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్‌తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది.
యోగా నిద్ర లేదా సమాధి స్థితి..
ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా.
తప్పనిసరిగా వాకింగ్..
ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్‌ని ఇస్తుందని అంటారు మోదీ.
అల్పాహరం, భోజనంగా..
ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్‌కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు.
ఆయర్వేదానికే ప్రాధాన్యత..
మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు.
అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ.
(చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!)
Comments
Please login to add a commentAdd a comment