నా ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! | What's Nayanthara's fitness secret? | Sakshi
Sakshi News home page

నా ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే!

Published Wed, Jul 24 2024 12:15 PM | Last Updated on Wed, Jul 24 2024 1:28 PM

What's Nayanthara's fitness secret?

మనిషికి ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇది సినీ తారలకు మరీ ముఖ్యం. అందుకు వ్యాయామం వంటి కసరత్తులతో పాటు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. కొందరు అందుబాటులో ఉన్నవి కదా అని అన్నీ తినేస్తుంటారు. దీంతో భారీ కాయంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాగా చాలా మంది కథానాయికలు వయసు పరంగా 40లో పడినా చాలా ఫిట్‌నెస్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఒకరు అగ్రనటి నయనతార. 

జవాన్‌ చిత్రంలో ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిన ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ తరగని అందాలతో నిగ నిగలాడుతున్న ఈ భామ ఫిట్‌నెస్‌ రహస్యమేమిటో? అని చాలా మంది ఆశ్యర్యపోతుంటారు. ఆ రహస్యాన్ని నయనతారనే ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. అందులో డైట్‌ అంటే ఇష్టమైన వన్నీ భుజించకూడదని, తాను ఇంతకు ముందు వరకూ భావించానన్నారు. అయితే అది కరెక్ట్‌ కాదని తన వైద్యురాలి ద్వారా తెలుసుకున్నానన్నారు. 

ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేయించుకుని, భుజిస్తున్నానని చెప్పారు. వాటిని ఆస్వాదిస్తూ తినడంతో జంక్‌ పదార్థాలపై కోరిక పుట్టడం లేదన్నారు. అలా తన ఆహారపు అలవాట్లే మారిపోయాయని పేర్కొన్నారు. మన లైఫ్‌ స్టైల్‌ బట్టే మన జీవన విధానం ఉంటుందని నయనతార అన్నారు. కాగా ప్రస్తుతం        ఈ లేడీ సూపర్‌స్టార్‌ తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క నిర్మాతగా, వ్యాపారవేత్తగా, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ పలు విధాలుగా సంపాదిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement