ఎంతైనా వందో టెస్టు కదా.. ఆ మాత్రం ఉండాలి | Virat Kohli Gives Death Stare Look For Suranga Lakmal 1st Test Vs SL | Sakshi
Sakshi News home page

Virat Kohli Vs Suranga Lakmal: ఎంతైనా వందో టెస్టు కదా.. ఆ మాత్రం ఉండాలి

Published Fri, Mar 4 2022 4:04 PM | Last Updated on Fri, Mar 4 2022 4:20 PM

Virat Kohli Gives Death Stare Look For Suranga Lakmal 1st Test Vs SL - Sakshi

టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి మాములుగానే అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. తన గంభీరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టడంలో సిద్ధహస్తుడు. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నోసార్లు తన అగ్రెసివ్‌నెస్‌తో అభిమానులను అలరించాడు. కోపం వచ్చినా.. సంతోషం వేసినా కోహ్లిని ఆపడం ఎవరి తరం కాదు.  ఇక లంకతో జరుగుతున్న తొలి టెస్టు కోహ్లికి వందోదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వందో టెస్టు ఆడుతున్న కోహ్లి మాములుగా ఉంటే ఏం మజా వస్తుంది. అందుకే లంక్‌ బౌలర్‌ సురంగ లఖ్మల్‌ను తన స్టన్నింగ్‌ లుక్‌తో భయపెట్టాడు.

విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్‌ 27వ ఓవర్లో మూడో బంతిని కోహ్లి బౌండరీ తరలించాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు వెళుతున్న కోహ్లిని బౌండరీ కొట్టావా అన్నట్లుగా లక్మల్‌ చూశాడు. అంతే ఒక్కసారిగా సీరియస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయిన కోహ్లి.. వెనక్కి తిరిగి కోపంతో లక్మల్‌ను ఒక చూపు చూశాడు. ఆ చూపు లక్మల్‌ను భయపెట్టేలా ఉందనడంలో సందేహం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. 

ఇక తన వందో టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. 45 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలవడంలో కోహ్లి విఫలమయ్యాడు. లసిత్‌ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో ఒక సూపర్‌ డెలివరీకి కోహ్లి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగడం విశేషం.

చదవండి: ఇది నాకు చాలా స్పెషల్‌ మూమెంట్‌.. మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు: కోహ్లి

IND vs SL 1st Test: 'బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు రోహిత్‌.. అదేంటి అలా ఔటయ్యావ్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement