పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాను కట్టడి చేశామన్న ఆనందం శ్రీలంక జట్టుకు ఎక్కువసేపు నిలువలేదు. తమ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కూడా తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 267/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి 286 పరుగులకే ఆలౌటైంది.
లంక బౌలర్లలో సురంగ లక్మల్ ఐదు వికెట్లు పడగొట్టగా... నువాన్ ప్రదీప్, రంగన హెరాత్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఫిలాండర్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (39; 5 ఫోర్లు), దినేశ్ చండీమల్ (28; 5 ఫోర్లు), ధనంజయ డిసిల్వా (43 బ్యాటింగ్; 5 ఫోర్లు) పోరాడటంతో శ్రీలంక స్కోరు 150 పరుగులు దాటింది. ప్రస్తుతం డిసిల్వాతో చమీరా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
శ్రీలంక తడబాటు
Published Wed, Dec 28 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
Advertisement