స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.
రబాడ రీఎంట్రీ
లంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?
సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్
సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్
తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)
రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)
కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..
ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత
Comments
Please login to add a commentAdd a comment