టీ20 వరల్డ్‌కప్-2024లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం(జూన్ 3) న్యూయర్క్ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఈ పొట్టిప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.
దక్షిణాఫ్రికా దంచికొడుతుందా?
దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబాడ, మార్కో జానెసన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.
కానీ ఇప్పుడూ వీరంతా జట్టులోకి రావడంతో శ్రీలంకకు గట్టిసవాలు ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ప్రోటీస్ జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌లో రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, వండర్ డస్సెన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.
అయితే కెప్టెన్ మార్‌క్రమ్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇక బౌలింగ్‌లో కూడా కగిసో రబాడ, అన్రిచ్ నోర్డే, జానెసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయలేం.
లంకేయులు పోటీ ఇస్తారా?
శ్రీలంకలో మునపటి జోష్ లేనప్పటికి తమదైన రోజున ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించగలదు. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన వార్మాప్ మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి వార్మాప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.
అయితే ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో మాత్రం లంక భారీ విజయాన్ని అందుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో శ్రీలంక ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుంది. శ్రీలంక కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృఢంగా కన్పిస్తోంది.
బ్యాటింగ్‌లో పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక, మాథ్యూస్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ వనిందు హసరంగా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి రావడం లంకకు కలిసొచ్చే ఆంశం. బౌలింగ్‌లో చమీరా, పతిరానా వంటి కీలక ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. చివరగా లంక సమిష్టగా రాణిస్తే ప్రోటీస్‌కు కష్టాల్లు తప్పవు.
దక్షిణాఫ్రికాదే పై చేయి..
కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. సౌతాఫ్రికా మూడింట, శ్రీలంక కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.
తుది జట్లు(అంచనా)
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, వనిందు హసరంగా (కెప్టెన్), దసున్ షనక, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, మతీషా పతిరణ.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, ఒట్నీల్ బార్ట్‌మన్.
Comments
Please login to add a commentAdd a comment