రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజాల టీమ్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా శ్రీలంక 11 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో జీవన్ మెండిస్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉపుల్ తరంగ (27 బంతుల్లో 36; 7 ఫోర్లు), మునవీరా (24 బంతుల్లో 26; 4 ఫోర్లు), గుణరత్నే (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించగా.. సఫారీ బౌలర్లు క్రుగెర్ 2, ఫిలాండర్, బోథా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. మోర్నీ వాన్ విక్ (56 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సఫారీ జట్టులో విక్ మినహా మరే ఇతర ఆటగాడు రాణించలేకపోయాడు. లంక బౌలర్లలో కులశేఖర 2, దిల్షాన్, ఉడాన, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో శ్రీలంక తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) చేరుకోగా.. 4 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించిన సౌతాఫ్రికా (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) నాలుగో స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా లెజెండ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) మూడో ప్లేస్‌లో నిలిచింది. ఆతర్వాత న్యూజిలాండ్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ ఓటమి), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఆస్ట్రేలియా (ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment