ఇస్లామాబాద్ : భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరుగా ఉంటుందనేది ఇప్పటికే చాలా మ్యాచ్‌లు నిరూపించాయి. ఒక ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. దాయాదుల పోరు అని ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్‌లు చాలావరకు రసవత్తరంగానే సాగుతుంటాయి. మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికి దేశంలో సన్మానం జరిగితే ఓడిపోయిన దేశంలో మాత్రం చెప్పుల దండలు పడుతుంటాయి. అయితే ప్రపంచకప్‌లో మాత్రం విజయాలు టీమిండియానే వరించాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరోసారి గుర్తుచేశాడు.
'90వ దశకంలో పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో మెరుగుపడింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌ను చాలా మ్యాచ్‌ల్లో ఓడించాము. కానీ ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయాం. అది 1992 వరల్డ్ కప్ నుంచి1999 ప్రపంచకప్ వరకు భారత జట్టుపై విజయం సాధించలేకపోయాం. 92 ప్రపంచకప్ టైటిల్ నెగ్గినా, 1996 క్వార్టర్ ఫైనల్,1999లో ప్రపంచకప్ ఫైనల్ చేరుకుని మంచి ప్రదర్శన కనబరిచినా భారత్‌పై మాత్రం విజయం సాధించలేకపోయాం. ఇదే ట్రెండ్ ఇప్పటి దశాబ్దంలో కూడా కొనసాగుతుంది. 2003 నుంచి 2019 ప్రపంచకప్ వరకు మా మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయాం. ఇండియా ఈ రికార్డును ఇప్పటికి పదిలంగా కాపాడుకుంటుంది.
('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం')
సాధారణ మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా ఆటగాళ్లు ప్రపంచకప్‌లో చెలరేగిపోతారు. అందుకే వారిని ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఓడించలేకపోయాం. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్, పాక్ జట్లు తలపడే అవకాశం తక్కువగా ఉన్నా.. లీగ్ మ్యాచ్‌లు జరిగితే మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా నిలుస్తుంది. అయితే 2011 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ఓడించే అవకాశం లభించినా మేం దానిని సరిగా వినియోగించుకోలేకపోయాంటూ' రజాక్ చెప్పుకొచ్చాడు. 1992 నుంచి 2019 ప్రపంచకప్ వరకు జరిగిన మ్యాచ్‌ల్లో 7-0 లీడ్‌తో భారత్ పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరించింది. ఒక్క 2007 వరల్డ్ కప్‌లో మాత్రం ఇరు జట్లు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆ ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్లు ఘోర ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.అబ్దుల్ రజాక్ పాక్ తరపున 46 టెస్టుల్లో 1946 పరుగులతో పాటు 100 వికెట్లు, 265 వన్డేల్లో 5080 పరుగులతో పాటు 269 వికెట్లు తీశాడు.
('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా')
Comments
Please login to add a commentAdd a comment