Abdul Razzaq
-
'నా దృష్టిలో కోహ్లినే బెటర్.. ఎందుకంటే?'
ఈతరం క్రికెటర్లలో బాబర్ ఆజం, విరాట్ కోహ్లిలు ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. అయితే కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి టాప్‌లోనే కొనసాగుతుండగా.. బాబర్ ఆజం మాత్రం కెరీర్ మొదట్లో తడబడినా.. ఆ తర్వాత తన మార్క్ చూపిస్తూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ ఇద్దరు తమ జట్లకు ఎన్నోసార్లు గెలిపించారు. ఇప్పటికి కెప్టెన్‌గా బాబర్ ఆజం బెస్ట్ అనిపిస్తుంటే.. కోహ్లి తన కెప్టెన్సీ ఎరాలో టీమిండియాను నెంబర్‌వన్ చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజం.అయితే పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మాత్రం కోహ్లికే ఓటేశాడు. తన దృష్టిలో కోహ్లి ఒక్క విషయంలో బాబర్ ఆజం కంటే ఒక మెట్టు పైన ఉన్నాడని పేర్కొన్నాడు. ''కోహ్లి, బాబర్ ఆజంలు ఇద్దరు ఇద్దరే. ఒకరితో ఒకరిని పోల్చలేం. పాకిస్తాన్ తరపున బాబర్ నెంబర్‌వన్ అయితే.. టీమిండియా తరపున కోహ్లి నెంబర్‌వన్. వన్డేలు, టి20లు, టెస్టులు ఇలా ఏదైనా కావొచ్చు.. ఇద్దరు చాలాకాలం నెంబర్‌వన్ బ్యాటర్లుగా కొనసాగారు. అయితే ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లి ఔట్‌స్టాండింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. చాలా కాలంగా జట్టులో కొనసాగుతున్నాడంటే అతని ఫిట్నెస్ ప్రధాన కారణం. వరల్డ్‌క్లాస్ ఫిట్నెస్ కలిగిన కోహ్లితో బాబర్ పోటీ పడలేడు. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలంటే బాబర్ కాస్త ఎక్కువ కష్టపడాలి.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! కసిగా ఉన్నట్లున్నాడు.. కెమెరాలు బద్దలైపోతున్నాయి -
బుమ్రాను దారుణంగా అవమానించిన పాక్ మాజీ ఆటగాడు
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో స్టార్ బౌలర్ ఎవరంటే మనకు టక్కున గుర్తుచ్చేది టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రానే. బుమ్రా తన బౌలింగ్ స్కిల్స్‌తో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అటువంటి అద్భుతమైన బౌలర్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదస్పద వాఖ్యలు చేశాడు. బుమ్రా ఓ బేబి బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు. అదే విధంగా పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదికి ఏ మాత్రం బుమ్రా సరిపోడని రజాక్ విమర్శించాడు. కాగా బుమ్రా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఓ స్థానిక న్యూస్ ఛానల్లో రజాక్ మాట్లాడుతూ.. "జస్ప్రీత్ బుమ్రా కంటే షాహీన్ అఫ్రిది అద్భుతమైన బౌలర్. షాహీన్ స్థాయికి బుమ్రా దగ్గరలో కూడా లేడు. నేను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ వంటి గొప్ప బౌలర్లతో కలసి ఆడాను. వాళ్లపై సులభంగా ఆధిపత్యం చెలాయించగలిగాను. బుమ్రా నా ముందు ఒక బేబీ బౌలర్" అంటూ హేళన చేశాడు. కాగా బుమ్రాపై రజాక్ విమర్శలు చేయడం ఇదేమి తొలి సారికాదు. అంతకుముందు 2019లో కూడా బుమ్రాను అతడు ఓ బేబీ బౌలర్ అంటూ కించపరిచాడు. ఇక అతడి వాఖ్యలపై టీమిండియా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. చదవండి: IND vs NZ: గిల్ టీ20లకు పనికిరాడు.. అతడికి అవకాశం ఇవ్వండి! అద్భుతాలు సృష్టిస్తాడు -
షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ తన ట్విటర్లో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీసీబీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలోనే పాక్ జట్టులోనూ ఆటగాళ్ల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. బాబర్ ఆజంను త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన షాహిద్ అఫ్రిది పాక్ తరపున అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 22 ఏళ్ల లాంగ్ కెరీర్లో అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2009 టి20 వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టులో అఫ్రిది సభ్యుడిగా ఉన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ కూడా పాక్ తరపున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 1996 నుంచి 2013 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్ రజాక్ 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇఫ్తికర్ అంజూమ్ పాక్ తరపున 62 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener. — Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022 -
తనయుడి బౌలింగ్‌లో తండ్రి గోల్డెన్ డక్
కళ్లముందే బిడ్డ ప్రయోజకుడై ఎదుగుతుంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. అలాంటిది తనకే సవాల్‌గా మారి విజయం సాధిస్తే ఏ తండ్రైనా గర్వపడతాడు. ఇలాంటివి చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను తనయుడు అలీ రజాక్ గోల్డెన్ డక్ చేయడం వైరల్‌గా మారింది. కింగ్డమ్ వాలీ మెగాస్టార్స్ లీగ్(ఎంఎస్ఎల్) 2022 లీగ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రావల్పిండి వేదికగా పెషావర్ పఠాన్స్, కరాచీ నైట్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబ్దుల్ రజాక్ పెషావర్ పఠాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తే.. తనయుడు అలీ రజాక్ కరాచీ నైట్స్ తరపున ఆడాడు. పెషావర్ పఠాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌నే అలీ రజాక్ వేశాడు. అబ్దుల్ రజాక్ ఓపెనర్‌గా వచ్చాడు. ఓవర్ తొలి బంతినే ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ డెలివరీ వేయగా.. రజాక్ బ్యాట్‌ను తగిలించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ చేతుల్లో పడడంతో అబ్దుల్ రజాక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతే తండ్రిని గోల్డెన్ డక్ చేశానన్న సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. అయితే పెవిలియన్ బాట పట్టిన అబ్దుల్ రజాక్ పైకి బాధపడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం తనయుడు తనను ఔట్ చేశాడన్న ఆనందం కచ్చితంగా ఉండి ఉంటుంది అని అభిమానులు పేర్కొన్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులు చేశాడు. Ali Razzaq takes wicket of his Father Abdul Razzaq | PP VS KK | Kingdom Valley MSL 2022 at Rawalpindi Cricket Stadium | Day 5 | Peshawar Pathans vs Karachi Knights#KingdomValleyMSL2022 #MegaStarsLeague #Cricketainment #ShahidAfridi #PeshawarPathans #KarachiKnights pic.twitter.com/S5c34sR6qq — Mega Stars League (@megastarsleague) December 22, 2022 చదవండి: విజయం దిశగా.. టీమిండియా టార్గెట్ 145 -
చెత్త వాగకు రజాక్.. టీమిండియాదే అన్ని విధాలా పైచేయి: పాక్ మాజీ క్రికెటర్
Danish Kaneria Blasts Abdul Razzaq: టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించాడు. చెత్త వాగడం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేసినంత మాత్రాన భారత జట్టును ఓడించలేమని, ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో పాక్ చిత్తుగా ఓడిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించాడు. అసలు పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జట్టు సరిగా లేదన్న కనేరియా.. కోహ్లి సేన అన్ని విధాలా ఆధిక్యంలో ఉందని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన అసలు తమకు పోటీయే కాదని.. టీమిండియాకు అంత సీన్ లేదంటూ అబ్దుల్ రజాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్ల ప్రతిభ ముందు.. భారత ఆటగాళ్లు ఏమాత్రం పనికిరారంటూ అవమానకర రీతిలో మాట్లాడాడు. ఈ విషయంపై స్పందించిన కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రజాక్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లో అసలు నిలకడ ఉందా? కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేస్తే... భారత జట్టును ఓడించడం సులభమమని రజాక్ చెబుతున్నాడు. నాన్సెన్స్.. అసలు టీమిండియాను మనవాళ్లు ఎలా ఓడించగలరు? పాకిస్తాన్ జట్టు కూర్పులోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల బ్యాటర్లు ఎక్కడ ఉన్నారు? ఇంగ్లండ్- బీ టీమ్ మనల్ని ఓడించింది. అసలు సెలక్షన్ ఎలా ఉందో చూశారా? ఇవన్నీ తెలిసి కూడా.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు’’ అని హితవు పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందిన పాకిస్తాన్ క్రికెటర్ నుంచి ఇది ఏ మాత్రం ఊహించలేదని చురకలు అంటించాడు. ఇక అన్ని విభాగాల్లో టీమిండియా పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందన్న కనేరియా... ‘‘ప్రతీ విభాగంలో వాళ్లు పటిష్టంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి ఎంతో మంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను ఎలా అవుట్ చేస్తారు? అన్నీ అంత సులభమేమీ కాదు కదా’’ అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా గురించి కూడా రజాక్ చేసిన వ్యాఖ్యలు సరికావన్న కనేరియా... ‘‘వసీం అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత యార్కర్లను అద్భుతంగా సంధించగల పర్ఫెక్ట్ బౌలర్ బుమ్రా. బుమ్రాను ఓడించగల యార్కర్ కింగ్ పాకిస్తాన్లో ఇంతవరకూ పుట్టలేదు. తన బౌలింగ్ అత్యద్భుతం. పాక్ బౌలర్లలో ఎవరూ తనకు అసలు పోటీనే కాదు’’ అని ప్రశంసలు కురిపించాడు. చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్ ప్రశంసలు -
టీమిండియాకు అంత సీన్ లేదు.. పాక్‌కు అసలు పోటీనే కాదు
Abdul Razzaq Feels Team India Cant Compete With Pakistan: టీ20 ప్రపంచకప్-2021లో భారత్-పాక్‌ల మధ్య పోరు నేపథ్యంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ టీమిండియాను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. టీమిండియా అసలు తమకు పోటీనే కాదని.. కోహ్లి సేనకు అంత సీన్ లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్ల టాలెంట్ చాలా భిన్నమైందని.. అది టీమిండియా ఆటగాళ్ల దగ్గర మచ్చుకైనా లేదని అన్నాడు. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ మెరుగైన ఆటగాళ్లను అందించిందని.. కపిల్ దేవ్ కంటే ఇమ్రాన్ ఖాన్ గొప్ప ఆల్‌రౌండర్ అని, వసీం అక్రమ్ లాంటి ప్లేయర్ భారత్‌లో పుట్టలేదని గొప్పలు పోయాడు. ఈ సందర్భంగా ఆయన భారత్-పాక్‌ల ద్వైపాక్షిక సిరీస్‌పై స్పందించాడు. ప్రస్తుత తరుణంలో భారత్-పాక్‌ల మధ్య సిరీస్ లేకపోవడం లోటుగా ఉందని, అది క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతూ ఉంటే ఎవరి టాలెంట్ ఎంతో ప్రపంచానికి కూడా తెలిసేదని అన్నాడు. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే పాక్ ప్లేయర్స్ ఒత్తిడిని ఎక్కువగా తట్టుకోగలరని, అది ఇటీవల జరిగిన మ్యాచ్‌ల ద్వారా నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన దాయాదుల పోరులో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం విశేషం. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్‌ల మధ్య రసవత్తర పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. చదవండి: దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు! -
నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా ఉంటుంది : అక్తర్
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలను కూడా మనతో షేర్ చేసుకుంటాడు. తాజాగా భారత్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ను పొరపాటున గాయపర్చిన సంఘటనను తన యూట్యూబ్ చానెల్లో అక్తర్ గుర్తుచేసుకున్నాడు. 'నా ప్రేమ కొంచెం క్రూరంగా ఉంటుంది . నేను ఎవర్నయినా ప్రేమిస్తే వారిని నెడుతూ, కొడుతూ మాట్లాడుతా. నా పద్ధతిలో ప్రేమ చూపించడం అంటే అదే. భారత్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో నేను యువరాజ్‌తో ఇలాగే ప్రవర్తించా. ప్రేమతో చేసిన పనిలో కొంచెం హద్దు మీరాను. దాంతో పొరపాటున యువరాజ్ వెన్నుకు గాయమైంది. అంతెందుకు షాహిద్ ఆఫ్రిదిని హత్తుకునే ప్రయత్నంలో అతన్ని కొంచెం గట్టిగా పట్టుకోవడంతో ఒక పక్కటెముక విరిగిపోవడం.. అబ్దుల్ రజాక్‌కు ప్రేమతో స్ట్రెచ్చింగ్ చేయిస్తున్న సమయంలో అనుకోకుండా నరం మెలికపడడం లాంటివి చోటుచేసుకున్నాయి. అయితే ఇదంతా ప్రేమతో సరదాకు చేసింది మాత్రమే. నేను ప్రేమను చూపించే విధానం కొంచెం వైల్డ్‌గా ఉంటుంది’ అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే అక్తర్ గత వారం భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ అదే పనిగా స్లెడ్జింగ్ చేయడంతో సెహ్వాగ్ అతనిపై విమర్శనాలు సంధించాడు. 'అదే పనిగా బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను నాన్‌స్ట్రైకర్ వైపు మీ బాబు నిలబడి ఉన్నాడు.. అతడికి చెప్పు అతడు కొట్టి చూపిస్తాడు.. నాన్‌స్ట్రైకర్‌లో సచిన్ ఉన్నాడు..’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన అక్తర్.. ‘సెహ్వాగ్ ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే నేను వదిలిపెట్టేవాడినా..? కచ్చితంగా గ్రౌండ్‌లోనే చితకబాదేవాడిని. తర్వాత హోటల్లో కూడా కొట్టేవాడిని’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై వీరు ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
టీమిండియా కావాలనే ఓడిపోయిందట!
కరాచీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. బెన్‌స్టోక్స్ తన తాజా పుస్తకం ‘ఆన్‌పైర్’లో భారత్‌తో మ్యాచ్‌లో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయని ప్రస్తావించడంతో అది కాస్తా సరికొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ విమర్శలు సంధించగా, తాజాగా ఆ జాబితాలో రజాక్ చేరిపోయాడు. ‘వరల్డ్‌కప్ లీగ్ దశలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్.. ఎందుకు ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ మేము చూశాం. ఒక జట్టు నాకౌట్‌కు క్వాలిఫై కాకూడదనే ఉద్దేశంతోనే టీమిండియా అలా చేసింది. అందులో అనుమానమేమీ లేదు. ఒక క్వాలిటీ బౌలర్ బౌలింగ్ సరిగా వేయలేదు. కావాలనే లైన్ తప్పాడు. పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భారత్ పరుగుల వేటలో వెనుకబడింది. ఫోర్లు, సిక్స్‌లు కొట్టాల్సిన సమయంలో డిఫెన్స్ ఆట మొదలు పెట్టింది. ఇవన్నీ అప్పుడే అనుమానాలకు తావిచ్చాయి. ఇప్పుడు స్టోక్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు’ అని రజాక్ విమర్శించాడు.(‘భారత్ ఓడిపోతుందని అనలేదు’) దీనిపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ కూడా ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేశాడు. తనకు వెస్టిండీస్ క్రికెటర్లు ఈ విషయాన్ని చెప్పారన్నాడు. పాకిస్తాన్‌ను నాకౌట్‌కు చేరకుండా చేయడానికి భారత్ ఓడిపోయిందని కొంతమంది విండీస్ క్రికెటర్లు చెప్పారన్నాడు. వారిలో జేసన్ హోల్డర్, క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ ఉన్నట్లు ముస్తాక్ అహ్మద్ తెలిపాడు. గత వరల్డ్‌కప్‌లో తాను విండీస్ క్రికెట్‌తో పని చేసిన సమయంలో ఈ విషయాన్ని వారు తెలిపారన్నాడు. ఓ పాకిస్తాన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ భారత్ కావాలని ఓడిపోయిందంటూ కొత్త రాగం అందుకున్నారు. గతేడాది ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337 పరుగులు చేయగా, భారత్ 306 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(102), కోహ్లి(66), రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(45), ఎంఎస్ ధోని(42 నాటౌట్)లు రాణించినా భారీ లక్ష్యం కావడంతో జట్టును గెలిపించలేకపోయారు. చివరి వరకూ ధోని క్రీజ్‌లో ఉన్నా భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.(‘మేము ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లం’) -
పాక్ క్రికెటర్‌తో మిల్కీ బ్యూటీ..
ఏ వుడ్ అయినా సరే, సినిమా వాళ్లపై రూమర్స్ తప్పవు. కొన్నిసార్లు అవి వారి ఉనికి గుర్తు చేస్తుంటే మరికొన్నిసార్లు మాత్రం పెద్ద తలనొప్పిగా మారుతాయి. సినీ సెలబ్రిటీలే కాదు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ఈ ముప్పు తప్పదు. అప్పట్లో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్‌ను పెళ్లాడనుందహో అని పుకారు రాయుళ్లు దరువేసి మరీ చాటింపు చేశారు. ఆ తర్వాత అదే నిజమైంది కూడా.. ఇన్నాళ్లకు మరో పాక్ క్రికెటర్‌తో ఓ టాలీవుడ్ తార ప్రేమలో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి తమన్నా, పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. (అలాంటివి చేయను..చూడను : తమన్నా) కాబోయే భార్యకు దగ్గరుండి మరీ నగలు కొనిస్తున్నాడంటూ అబ్దుల్ రజాక్‌ను ఆడేసుకుంటున్నారు. అయితే ఈ రూమర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందీ మిల్కీ బ్యూటీ. "ఒకరోజు నటుడి పేరు చెప్తారు. మరో రోజు క్రికెటర్ అంటారు, ఇటు డాక్టర్ అంటారు, అటు క్రికెటర్ అంటారు. ఇలా అందరితో రిలేషన్షిప్ అంటగట్టడం ఏంట"ని కడిగి పారేసింది. తను ఎవరితోనూ డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. మరి ఫొటో అంటారా? గతంలో దుబాయ్‌లో ఓ నగల షాపు ప్రారంభోత్సవానికి తమన్నాతో పాటు, అబ్దుల్ కూడా వెళ్లాడు. అప్పుడు తీసిందేనన్నమాట ఈ ఫొటో. ("నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో చెత్త సినిమా") -
'వారిని ప్రపంచకప్‌లో మాత్రం ఓడించలేకపోయాం'
ఇస్లామాబాద్ : భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరుగా ఉంటుందనేది ఇప్పటికే చాలా మ్యాచ్‌లు నిరూపించాయి. ఒక ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. దాయాదుల పోరు అని ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్‌లు చాలావరకు రసవత్తరంగానే సాగుతుంటాయి. మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికి దేశంలో సన్మానం జరిగితే ఓడిపోయిన దేశంలో మాత్రం చెప్పుల దండలు పడుతుంటాయి. అయితే ప్రపంచకప్‌లో మాత్రం విజయాలు టీమిండియానే వరించాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరోసారి గుర్తుచేశాడు. '90వ దశకంలో పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో మెరుగుపడింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌ను చాలా మ్యాచ్‌ల్లో ఓడించాము. కానీ ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయాం. అది 1992 వరల్డ్ కప్ నుంచి1999 ప్రపంచకప్ వరకు భారత జట్టుపై విజయం సాధించలేకపోయాం. 92 ప్రపంచకప్ టైటిల్ నెగ్గినా, 1996 క్వార్టర్ ఫైనల్,1999లో ప్రపంచకప్ ఫైనల్ చేరుకుని మంచి ప్రదర్శన కనబరిచినా భారత్‌పై మాత్రం విజయం సాధించలేకపోయాం. ఇదే ట్రెండ్ ఇప్పటి దశాబ్దంలో కూడా కొనసాగుతుంది. 2003 నుంచి 2019 ప్రపంచకప్ వరకు మా మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయాం. ఇండియా ఈ రికార్డును ఇప్పటికి పదిలంగా కాపాడుకుంటుంది. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం') సాధారణ మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా ఆటగాళ్లు ప్రపంచకప్‌లో చెలరేగిపోతారు. అందుకే వారిని ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఓడించలేకపోయాం. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్, పాక్ జట్లు తలపడే అవకాశం తక్కువగా ఉన్నా.. లీగ్ మ్యాచ్‌లు జరిగితే మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా నిలుస్తుంది. అయితే 2011 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ఓడించే అవకాశం లభించినా మేం దానిని సరిగా వినియోగించుకోలేకపోయాంటూ' రజాక్ చెప్పుకొచ్చాడు. 1992 నుంచి 2019 ప్రపంచకప్ వరకు జరిగిన మ్యాచ్‌ల్లో 7-0 లీడ్‌తో భారత్ పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరించింది. ఒక్క 2007 వరల్డ్ కప్‌లో మాత్రం ఇరు జట్లు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆ ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్లు ఘోర ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.అబ్దుల్ రజాక్ పాక్ తరపున 46 టెస్టుల్లో 1946 పరుగులతో పాటు 100 వికెట్లు, 265 వన్డేల్లో 5080 పరుగులతో పాటు 269 వికెట్లు తీశాడు. ('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా') -
హార్దిక్.. టాలెంట్ ఉంటే సరిపోదు!
కరాచీ: టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాను అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దుతానంటూ గతంలో ప్రకటించిన పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. మరొకసారి హార్దిక్‌ను టార్గెట్ చేశాడు. ఇప్పటికీ హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి ఆల్ రౌండర్ కాలేదని పేర్కొన్నరజాక్.. టాలెంట్ ఉంటే సరిపోదని, ఇంకా శ్రమించాలని కొత్త పల్లవి అందుకున్నాడు. అదే సమయంలో ఏ క్రికెటర్‌కైనా మనీ ఎక్కువైతే రిలాక్స్ అయిపోతారంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్యూలో రజాక్ మాట్లాడుతూ.. హార్దిక్ గురించి పలు విషయాలను ప్రస్తావించాడు. ‘ హార్దిక్ ఒక మంచి క్రికెటర్. కానీ ఇంకా పూర్తి స్థాయి ఆల్ రౌండర్ కాలేదు. హార్దిక్ మెరుగైన ఆల్ రౌండర్ కావాలాంటే మరింత కష్టపడాలి. గేమ్‌కు సాధ్యమైనంత సమయం కేటాయించకపోతే అది నిన్ను వదిలేస్తుంది. హార్దిక్ శారీరకంగా, మానసికంగా గేమ్‌పై దృష్టి పెట్టాలి. రిలాక్స్ అయితే అది చాలా ప్రమాదం. కొంతమంది డబ్బు ఎక్కువైతే చేసే పని మీద ఫోకస్ చేయరు. దాంతో మళ్లీ మొదటకొస్తారు’ అని క్లాస్ తీసుకున్నాడు. ఇక్కడ తమ దేశ క్రికెటర్ మహ్మద్ అమిర్‌ను ఉదహరించాడు. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అమిర్ రిలాక్స్ అయిపోవడం వల్లే అతని కెరీర్ గాడి తప్పిందన్నాడు. ఇదే విషయం ఎవరికైనా వర్తిస్తుందని హార్దిక్‌ను పరోక్షంగా హెచ్చరించాడు. (టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్) గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా అది కరోనా వైరస్ కారణంగా జరగలేదు. కాగా, హార్దిక్ తన ఫిట్నెస్ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్‌లో రిలయన్స్-1 తరఫున ఆడిన హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్.. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దాంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత రికార్డు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించాడు. (నా వద్ద రోహిత్, కోహ్లిలకు చోటు లేదు!) -
అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్ని విధాల విమర్శల పాలవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫిట్నెస్ పరీక్షలకు హాజరై ట్రైనీతో గొడవపడిన అక్మల్.. మరొకసారి తాను చేసిన ట్వీట్‌తో నవ్వుల పాలయ్యాడు. ఇక్కడ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేయడంతో నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ఇంగ్లిష్‌లో అంతగా ప్రావీణ్యం లేని ఉమర్ అక్మల్.. రజాక్‌తో దిగిన ఫొటోను ట్వీటర్లో జత చేసి ‘Mother from another Brother’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ కాస్త తికమక పడ్డ అక్మల్.. ఏకంగా రజాక్‌ను ‘అమ్మ’ను చేయడం ఒకవైపు నవ్వులు పూయించడంతో పాటు మరొకవైపు విమర్శల పాలు చేసింది. వాస్తవానికి ‘Brother from another Mother’ అనే విషయాన్ని ఉమర్ అక్మల్ చెప్పాలనుకున్నాడు.. కానీ.. దాన్ని రివర్స్‌లో ఉమర్ అక్మల్ వాడేశాడు. (ఇక్కడ చదవండి: నాకు కొవ్వుందా.. ఏది చూపించు!) దీంతో.. నెటిజన్లు అతనిపై సెటైర్ల వర్షం కురిపించేశారు. అభిమానుల విమర్శలతో తేరుకున్న ఉమర్ అక్మల్.. వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది వైరల్‌గా మారిపోవడంతో ఉమర్ అక్మల్ మరొకసారి ‘ట్రెండ్’ అయిపోయాడు. ‘ఎందుకురా నాయనా.. ఇంగ్లిష్ రాకపోతే, నీకు తెలిసిన హిందీలో ట్వీట్ చేయొచ్చు కదా’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ నీకు పాకిస్తాన్ జట్టులో అవకాశం రాకపోతే, దాన్ని దక్కించుకునే ప్రయత్నం గట్టిగా చేయి కానీ ఇలా అభాసు పాలుకావొద్దు’ అని మరొకరు చమత్కరించారు. ‘An apple a day keeps the doctor away’ అనే సామెతను ‘A doctor a day Keeps the apple away’ అన్నట్లు ఉంది ఉమర్ అక్మల్ సర్ అంటూ విమర్శిస్తున్నారు. -
‘అదే ఉంటే కోహ్లిని మించిపోతారు’
లాహోర్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నుంచి విరాట్ కోహ్లికి విశేషమైన మద్దతు ఉండటం నిజంగా అతని అదృష్టమని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని, కాకపోతే బీసీసీఐ నుంచి సైతం పూర్తి సహకారం ఉండటం గర్వించదగినదన్నాడు. ఒక క్రికెట్ బోర్డు నుంచి కెప్టెన్‌కు అంతలా సహకారం అందించే విషయంలో కోహ్లి కచ్చితంగా లక్కీనేనని తెలిపాడు. ‘ కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కోహ్లి ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోవడానికి బీసీసీఐ ఇచ్చే మద్దతు కూడా అమోఘం. ఆ తరహాలో ఎవరికి సహకారం ఉన్నా వారు సక్సెస్ బాటలోనే పయనిస్తారు. కోహ్లికి విశేషమైన సహకారం ఉండటంతోనే అద్భుతమైన ఆటను ఆస్వాదిస్తున్నాడు. దాంతోపాటు అదే తరహా ఫలితాలు కూడా చూస్తున్నాం. ఇక మా ఆటగాళ్లకి, మా కెప్టెన్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి వచ్చే సహకారం చాలా తక్కువ. బీసీసీఐ తరహా సహకారం ఉంటే పాకిస్తాన్ క్రికెటర్లు కోహ్లిని మించిపోతారు. మా పీసీబీ సిస్టమ్‌లో ఆటగాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాకిస్తాన్లో చాలా టాలెంట్ ఉంది. మా క్రికెటర్లకు పీసీబీ పూర్తి మద్దతు ఇస్తే కోహ్లి కంటే అత్యుత్తమ ఆటను బయటకు తీస్తారు’ అని రజాక్ అభిప్రాయపడ్డాడు. (ఇక్కడ చదవండి: కోహ్లి.. అంత ఈజీ కాదు!) భారత్-ఆసీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ తర్వాత స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. కోహ్లి అసాధారణ ఆటగాడని, అన్ని ఫార్మాట్లలో అతడు సాధించిన రికార్డులు అమోఘమని కొనియాడాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడని అన్నారు. పరుగుల దాహంతో ఉన్న కోహ్లి భవిష్యత్తులో మరిన్ని రికార్డులను కొల్లగొడతాడని అన్నాడు. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లు ఏమీ తక్కువ కాదంటూ రజాక్ వెనకేసుకొచ్చాడు. కాకపోతే కోహ్లికి ఇచ్చే మద్దతు తమ ఆటగాళ్లకు ఇవ్వకపోవడంతోనే వెనుకబడిపోయారన్నాడు. (ఇక్కడ చదవండి: కోహ్లిని ఊరిస్తున్న టీ20 రికార్డులు) -
ఇక బుమ్రాతో పోటీ షురూ చేయాల్సిందే..!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసలు పూర్తిస్థాయి బౌలరే కాదని, అతనొక బేబీ బౌలర్ అంటూ తన అక్కసును వెళ్లగక్కిని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక బుమ్రాతో రజాక్‌కు పోటీ పెట్టిల్సిందేనంటూ కౌంటర్ అటాక్‌కు దిగారు. ‘బుమ్రాకు నీకు ఒక ఓవర్ పోటీ పెడదాం. ఆ ఓవర్లో నువ్వు ఎన్ని పరుగులు కొడతావో చూద్దాం. అసలు ఫస్ట్‌బాల్‌కే ఔట్ అవ్వకుండా ఉంటే చూద్దాం’ అని ఒక అభిమాని ఎద్దేవా చేయగా, ‘ 36 పరుగులు- 6 బంతులు.. ఇది రజాక్ బ్యాటింగ్‌కు బుమ్రా బౌలింగ్‌కు పోటీ’ అంటూ మరొకరు సవాల్ విసిరారు. ‘ ఇది కదా జోక్ ఆఫ్ ద ఇయర్’ అంటే అని మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘ 2011 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మునాఫ్ పటేల్ 115 కి.మీ వేగతంతో వేసిన బంతికి బౌల్డ్ అయ్యావ్.. గుర్తు లేదా. ఇంకా వేగంగా వేసే బౌలర్లు కావాలా’ అంటూ మరొకరు విమర్శించారు. ‘ ఆసీస్ దిగ్గజం మెక్ గ్రాత్పైనే ఆధిపత్యం కొనసాగించావా.. టెస్టుల్లో మెక్‌గ్రాత్ నీకు 113 బంతులు వేస్తే 20 పరుగులు చేసి రెండు సార్లు ఔటయ్యావ్.. ఇక వన్డేల్లో మెక్‌గ్రాత్ వేసిన 35 బంతుల్లో 39 పరుగులు చేసి మూడుసార్లు పెవిలియన్ చేరావ్.. ఇదేనా నీ అధిపత్యం’ అని మరొక అభిమాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలా రజాక్‌పై సోషల్ మీడియాలో అభిమానులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు రజాక్ ఏమన్నాడంటే..‘నేను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మైదానాల్లో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. దీంతో బుమ్రా నాకు పెద్ద సమస్యే కాదు. నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్. అతడి బౌలింగ్‌లో అవలీలగా పరుగులు సాధిస్తా. గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం ఆక్రమ్, షోయాబ్ అక్తర్ వంటి ఆల్‌టైమ్ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా విషయంలో అదే జరిగింది. నేను క్రికెట్ ఆడే సమయంలో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాననే విషయం బుమ్రాకు కూడా తెలుసు’ అని రజాక్ అన్నాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ నోటికి పని చెప్పాడు రజాక్. -
‘నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్’
హైదరాబాద్: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌కు పబ్లిసిటీ పిచ్చి సోకినట్టుంది. తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పట్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని.. తనను బతిమాలితే హార్దిక్ పాండ్యాను ప్రపంచ శ్రేణి ఆల్‌రౌండర్‌ను చేస్తానని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మరో స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై తన అక్కసును వెల్లగక్కాడు ఈ పాక్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్. బుధవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజాక్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మైదానాల్లో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. దీంతో బుమ్రా నాకు పెద్ద సమస్యే కాదు. నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్. అతడి బౌలింగ్‌లో అవలీలగా పరుగులు సాధిస్తా. గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం ఆక్రమ్, షోయాబ్ అక్తర్ వంటి ఆల్‌టైమ్ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా విషయంలో అదే జరిగింది. నేను క్రికెట్ ఆడే సమయంలో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాననే విషయం బుమ్రాకు కూడా తెలుసు 1992 నుంచి 2007 మధ్య కాలంలో క్రికెట్ ఆడిన ఆటగాళ్లను, ఫ్యాన్స్‌ను అడగండి అసలు క్రికెట్ అంటే ఏమిటి? దాని మజా ఏంటని?. వాళ్లు మాత్రమే దానికి సమాధానం చెబుతారు. అప్పటివారు నిజమైన వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. ప్రస్తుత క్రికెటర్లు సుదీర్ఘ కాలం ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా కొనసాగలేరు. ప్రస్తుత క్రికెటర్ల బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అంతగా పస ఉండటం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మంచి ప్లేయర్. కానీ సచిన్ టెండూల్కర్‌తో పోల్చలేము. వీరిద్దరిని ఓకే దృష్టిలో చూడలేము. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు’అంటూ రజాక్ పేర్కొన్నాడు. -
‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరొకసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ మతాన్ని ప్రస్తావించి విమర్శలపాలైన రజాక్.. తాజాగా పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ.. ‘నేను సంప్రాదయబద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నాను. అది కూడా ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. నాకు ఇది తప్పనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగుతోంది. రజాక్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది.. ఈ రోజుతో అది పోయింది’, ‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని, షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని రజాక్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆడే రోజుల్లో వివాదాల జోలికి వెళ్లకుండా మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుతెచ్చుకున్న రజాక్ గత కొద్ది రోజులగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. -
షమీ మతాన్ని ప్రస్తావించిన రజాక్
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంగ్లండ్‌పై గెలిస్తే పాక్ సెమీస్ చేరేదని కానీ భారత్ కావాలనే ఓడిపోయిందని వారు విమర్శిస్తున్నారు. దీనిపై పాక్ మీడియా చానెళ్లు కూడా ప్రత్యేక డిబేట్లు పెట్టి మరింత నిప్పు రాజేస్తున్నారు. ఈ సమావేశాలో పాక్ మాజీ ఆటగాళ్లు తమ నోటికి పనిచెబుతూ.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని పొగుడుతూ అతడి మతాన్ని ప్రస్తావిస్తాడు. (చదవండి: హార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి) భారత్ ఓటమి పాలు కావడం, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గల అవకాశాలను దెబ్బతీయడంపై పాక్ న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా ఆ ఛానల్ వారు ఫోన్ఇన్లో అబ్దుల్ రజాక్ అభిప్రాయాలను సేకరించారు. ‘ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా విజయాలను సాధించడంలో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షమీ ముస్లిం కావడం మనకు మంచి విషయం. టీమిండియా మిగిలిన బౌలర్లు విఫలమైన చోట షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఓ వైపు షమీ వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచితే మిగిలిన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు’అంటూ రజాక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రజాక్ వాయిస్‌గా భావిస్తున్న ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో మతాన్ని లాగడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. రజాక్ ఈ వ్యాఖ్యలతో ఏం చెప్పదల్చుకున్నాడో స్పష్టంగా అర్థమైందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక పాక్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోవాలి. దీంతో ప్రపంచకప్ రసవత్తరంగా మారుతోంది. -
హార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి: పాక్ మాజీ క్రికెటర్
మాంచెస్టర్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు రెండు వారాలు కోచింగ్ అవకాశం ఇస్తే హార్దిక్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. అతడిని గొప్ప ఆల్‌రౌండర్‌గా చూడాలని బీసీసీఐ భావిస్తే తనను సంప్రందించవచ్చని తెలిపాడు. యూఏఈ వంటి తటస్థ వేదికల్లో పాండ్యాకు కోచింగ్ ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రజాక్ అన్నాడు. ‘ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆటను క్షుణ్ణంగా పరిశీలించాను. అతడి బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా లోపాలున్నాయి. హిట్టింగ్ చేయడానికి బంతిని బలంగా బాదే క్రమంలో అతడి శరీరం అదుపుతప్పుతుంది. ఫుట్‌వర్క్ కూడా అంతగా బాగోలోదు. నాకు రెండు వారాలు కోచింగ్ అవకాశమిస్తే హార్దిక్ పాండ్యాను గొప్ప ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా. తటస్థ వేదికల్లో పలు సెషన్లు నిర్వహించడానికి కూడా నేను సిద్దం. హార్దిక్‌ను గొప్ప ఆల్‌రౌండర్‌గా చూడాలని బీసీసీఐ భావిస్తే నన్ను ఎప్పుడైన సంప్రదించవచ్చు’అంటూ రజాక్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక రజాక్ ట్వీట్లపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘ఉద్యోగం కావాలని బీసీసీఐని నేరుగా అడగొచ్చు కదా అంటూ’చురకలు అంటిస్తున్నారు. అయితే రజాక్ గొప్ప ఆల్‌రౌండర్ అని అతడి కోచింగ్‌లో పాండ్యా ఇంకా మెరుగయ్యే అవకాశం ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక వెస్టిండీస్‌పై విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌ను కోహ్లి సేన ఢీ కొట్టబోతోంది. -
వకార్ పై మండిపడ్డ రజాక్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గా పని చేసి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన వకార్ యూనిస్‌పై ఆ దేశ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మండిపడ్డాడు. వకార్ వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు తీరని నష్టం జరిగిందంటూ రజాక్ విమర్శించాడు. వకార్ అతని వైఫల్యాన్ని పక్కకు పెట్టి ఇతరుల్ని తప్పుబడుతున్నాడన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని నిలదీశాడు. పాకిస్తాన్ క్రికెట్లో రహస్యమేమీ లేదు. సీనియర్ ఆటగాళ్లకు వకార్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. దాంతో పాటు ఆటగాళ్లని కూడా సమాన దృష్టితో కూడా చూసేవాడు కాదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించే పని ఎప్పుడూ చేయలేదు. ఇందుకు నేనే సాక్ష్యం. దానికి అతనిలో ఉన్న అభద్రతా భావమే ప్రధాన కారణం. పదే పదే తప్పులు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ అట్టడుగు స్థాయికి వెళ్లడానికి వకార్ కారణమమయ్యాడు 'అని రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ సలహాదారులుగా యూనస్ ఖాన్, మిస్బాబుల్ హక్‌లను నియమించడం పట్ల కూడా రజాక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ క్రికెట్ కు జరిగిన అన్యాయానికి వారు ఏ విధమైన సలహా ఇస్తారని ప్రశ్నించాడు. కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు కూడా దేశ క్రికెట్ ను దిగజార్చాడానికి పరోక్షంగా కారణమయ్యారని రజాక్ ధ్వజమెత్తాడు. -
కోల్‌కతా ఫ్లైఓవర్ కింద తెలుగు వ్యక్తి సమాధి
కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. అబ్దుల్ రజాక్ (31) లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా... కర్ణాటక నుంచి అల్లం సరుకును కోల్‌కతా నగరానికి తీసుకెళ్లి దిగుమతి చేసి వస్తున్నారు. వీరి లారీ ఫ్లైఓవర్ కింద చిక్కుకుపోవడంతో అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయాడు. -
పాక్ క్రికెటర్ల మూకుమ్మడి రిటైర్మెంట్!
ఎంసీఎల్‌కు అనుమతించకపోవడంపై స్పందన కరాచీ: మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో ఆడేందుకు ఉత్సాహం చూపించిన పలువురు సీనియర్ పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ బోర్డు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయబోమని బోర్డు ప్రకటించింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించి, ఇకపై తాము పాకిస్తాన్‌కు ఆడాలనే ఆసక్తిని ప్రదర్శించమని లేఖ రాసి ఇస్తేనే ఎంసీఎల్లో ఆడవచ్చని స్పష్టం చేసింది. దాంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు గంట వ్యవధిలోనే తమ రిటైర్మెంట్లను ప్రకటించడం విశేషం. ఎంసీఎల్లో ఆడేందుకు వీరు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. వీరంతా ప్రస్తుత పాక్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా... ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అబ్దుల్ రజాక్, మొహమ్మద్ యూసుఫ్, ఇమ్రాన్ ఫర్హత్, తౌఫీక్ ఉమర్, యాసిర్ హమీద్ ఈ జాబితాలో ఉన్నారు.