కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్ని విధాల విమర్శల పాలవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరై ట్రైనీతో గొడవపడిన అక్మల్.. మరొకసారి తాను చేసిన ట్వీట్‌తో నవ్వుల పాలయ్యాడు. ఇక్కడ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేయడంతో నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ఇంగ్లిష్‌లో అంతగా ప్రావీణ్యం లేని ఉమర్ అక్మల్.. రజాక్‌తో దిగిన ఫొటోను ట్వీటర్‌లో జత చేసి ‘Mother from another Brother’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ కాస్త తికమక పడ్డ అక్మల్.. ఏకంగా రజాక్‌ను ‘అమ్మ’ను చేయడం ఒకవైపు నవ్వులు పూయించడంతో పాటు మరొకవైపు విమర్శల పాలు చేసింది. వాస్తవానికి ‘Brother from another Mother’ అనే విషయాన్ని ఉమర్ అక్మల్ చెప్పాలనుకున్నాడు.. కానీ.. దాన్ని రివర్స్‌లో ఉమర్ అక్మల్ వాడేశాడు. (ఇక్కడ చదవండి: నాకు కొవ్వుందా.. ఏది చూపించు!)
దీంతో.. నెటిజన్లు అతనిపై సెటైర్ల వర్షం కురిపించేశారు. అభిమానుల విమర్శలతో తేరుకున్న ఉమర్ అక్మల్.. వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది వైరల్‌గా మారిపోవడంతో ఉమర్ అక్మల్ మరొకసారి ‘ట్రెండ్’ అయిపోయాడు. ‘ఎందుకురా నాయనా.. ఇంగ్లిష్ రాకపోతే, నీకు తెలిసిన హిందీలో ట్వీట్ చేయొచ్చు కదా’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ నీకు పాకిస్తాన్ జట్టులో అవకాశం రాకపోతే, దాన్ని దక్కించుకునే ప్రయత్నం గట్టిగా చేయి కానీ ఇలా అభాసు పాలుకావొద్దు’ అని మరొకరు చమత్కరించారు. ‘An apple a day keeps the doctor away’ అనే సామెతను ‘A doctor a day Keeps the apple away’ అన్నట్లు ఉంది ఉమర్ అక్మల్ సర్ అంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment