
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో స్టార్ బౌలర్ ఎవరంటే మనకు టక్కున గుర్తుచ్చేది టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రానే. బుమ్రా తన బౌలింగ్ స్కిల్స్‌తో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అటువంటి అద్భుతమైన బౌలర్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదస్పద వాఖ్యలు చేశాడు.
బుమ్రా ఓ బేబి బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు. అదే విధంగా పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదికి ఏ మాత్రం బుమ్రా సరిపోడని రజాక్ విమర్శించాడు. కాగా బుమ్రా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక ఓ స్థానిక న్యూస్ ఛానల్‌లో రజాక్ మాట్లాడుతూ.. "జస్ప్రీత్ బుమ్రా కంటే షాహీన్ అఫ్రిది అద్భుతమైన బౌలర్. షాహీన్ స్థాయికి బుమ్రా దగ్గరలో కూడా లేడు. నేను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ వంటి గొప్ప బౌలర్లతో కలసి ఆడాను.
వాళ్లపై సులభంగా ఆధిపత్యం చెలాయించగలిగాను. బుమ్రా నా ముందు ఒక బేబీ బౌలర్" అంటూ హేళన చేశాడు. కాగా బుమ్రాపై రజాక్ విమర్శలు చేయడం ఇదేమి తొలి సారికాదు. అంతకుముందు 2019లో కూడా బుమ్రాను అతడు ఓ బేబీ బౌలర్ అంటూ కించపరిచాడు. ఇక అతడి వాఖ్యలపై టీమిండియా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
చదవండి: IND vs NZ: గిల్ టీ20లకు పనికిరాడు.. అతడికి అవకాశం ఇవ్వండి! అద్భుతాలు సృష్టిస్తాడు
Comments
Please login to add a commentAdd a comment