టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు. ఫాస్ట్‌బౌలర్లకు గాయాలు సహజమేనని.. అయితే, రీఎంట్రీలో బుమ్రా వంటి కొంతమంది మాత్రమే నిలకడగా ఆడగలరని పేర్కొన్నాడు.
పాక్ ప్రధాన పేసర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదితో పోలిస్తే.. బుమ్రానే ఉత్తమ బౌలర్ అని మహ్మద్ ఇర్ఫాన్ కుండబద్దలు కొట్టాడు. ‘‘ఫాహిన్ ఎప్పుడైనా ఫిట్‌నెస్ సమస్యల వల్ల జట్టుకు దూరమైతే.. తిరిగి మైదానంలో దిగినపుడు అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గుతుంది.
ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ బుమ్రా అలా కాదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడు మరింత గొప్పగా ఆడతాడు. అందుకే వీరిద్దరిలో బుమ్రానే బెస్ట్’’ అంటూ ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు మహ్మద్ ఇర్ఫాన్.
కాగా 2022 ద్వితీయార్థం నుంచి 2023 ప్రథమార్థం వరకు జస్‌ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది గాయాలతో సతమతమయ్యారు. అయితే, గతేడాది ఆగష్టులో టీమిండియా తరఫున పునరాగమనం చేసిన బుమ్రా అదరగొడుతున్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు.
అంతేగాకుండా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడీ స్టార్ పేసర్. ఇక.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ 11 మ్యాచ్‌లు ఆడి 20 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది మాత్రం మునుపటిలా రాణించలేక చతికిలపడ్డాడు.
ఇక పాక్ టీ20 కెప్టెన్‌గా హోదాలో ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన షాహిన్ ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్ ఇర్ఫాన్ పాకిస్తాన్ తరఫున 2012లో అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా నాలుగు టెస్టుల్లో 10, 60 వన్డేల్లో 83, 22 టీ20 మ్యాచ్‌లలో భాగమై 16 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Mohammed Shami: ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! వైరల్
Comments
Please login to add a commentAdd a comment