Mohammad Irfan
-
అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు. ఫాస్ట్‌బౌలర్లకు గాయాలు సహజమేనని.. అయితే, రీఎంట్రీలో బుమ్రా వంటి కొంతమంది మాత్రమే నిలకడగా ఆడగలరని పేర్కొన్నాడు. పాక్ ప్రధాన పేసర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదితో పోలిస్తే.. బుమ్రానే ఉత్తమ బౌలర్ అని మహ్మద్ ఇర్ఫాన్ కుండబద్దలు కొట్టాడు. ‘‘ఫాహిన్ ఎప్పుడైనా ఫిట్నెస్ సమస్యల వల్ల జట్టుకు దూరమైతే.. తిరిగి మైదానంలో దిగినపుడు అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గుతుంది. ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ బుమ్రా అలా కాదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడు మరింత గొప్పగా ఆడతాడు. అందుకే వీరిద్దరిలో బుమ్రానే బెస్ట్’’ అంటూ ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు మహ్మద్ ఇర్ఫాన్. కాగా 2022 ద్వితీయార్థం నుంచి 2023 ప్రథమార్థం వరకు జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది గాయాలతో సతమతమయ్యారు. అయితే, గతేడాది ఆగష్టులో టీమిండియా తరఫున పునరాగమనం చేసిన బుమ్రా అదరగొడుతున్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేగాకుండా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడీ స్టార్ పేసర్. ఇక.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ 11 మ్యాచ్‌లు ఆడి 20 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది మాత్రం మునుపటిలా రాణించలేక చతికిలపడ్డాడు. ఇక పాక్ టీ20 కెప్టెన్‌గా హోదాలో ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన షాహిన్ ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్ ఇర్ఫాన్ పాకిస్తాన్ తరఫున 2012లో అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా నాలుగు టెస్టుల్లో 10, 60 వన్డేల్లో 83, 22 టీ20 మ్యాచ్‌లలో భాగమై 16 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Mohammed Shami: ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! వైరల్ -
ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా
ఇస్లామాబాద్ : క్రికెట్ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుంచి మొదలుకొని సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటతీరును చూశాం.. చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆటలో తమ నైపుణ్యతను అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇలా ఏదో ఒక దాంట్లో తమ మెళుకువలను చూపెడుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, ఇయాన్ బోథమ్ సహా ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఇదే కోవలోకి వస్తారు. కానీ కొంతమంది మాత్రం ప్రదర్శనతో కాకుండా తమ రూపురేఖలతో ఆకట్టుకుంటారు. క్రికెట్లో అత్యంత పొడవైన క్రికెటర్‌గా పాక్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇర్ఫాన్ పొడవు .. 7 అడుగుల 1అంగుళం. (చదవండి : ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా) 2010లో పాక్ వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఇర్ఫాన్ తన బౌన్సర్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ రికార్డును పాక్‌కే చెందిన ముదస్సార్ గుజ్జర్ అనే కుర్రాడు బద్దలు కొట్టాడు. గుజ్జర్ పొడవు 7 అడుగుల 6 అంగుళాలు. ముదస్సార్ గుజ్జర్ గతేడాది నవంబర్‌లో లాహోర్ క్వాలాండర్స్ డెవలప్మెంట్ లో చేరి కోచ్, ట్రైనర్ల సహాయంతో బౌలర్‌గా శిక్షణ పొందుతున్నాడు. గుజ్జార్ ఎక్కువ పొడవు కావడంతో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కఠోర సాధన చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పాక్ తరపున దేశవాలి క్రికెట్లో ఆడి పేరు సంపాదించి ఆపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్నాడు. తాజాగా ముదస్సార్ గుజ్జార్‌ను కలిసిన ఒక జర్నలిస్ట్ అతనితో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ' ముదస్సార్ గుజ్జార్ పొడవు.. 7 అడుగుల 6 అంగుళాలు, షూ సైజ్ 23.6.. ఇంత పొడవు క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా.. మీట్ విత్ ముదస్సార్ గుజ్జార్' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(చదవండి : ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) సాధారణంగా విండీస్ నుంచి వచ్చే క్రికెటర్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆరు అడుగులకు పైగానే ఉంటారు. మన టీమిండియాలో కూడా అత్యంత పొడగరి ఎవరంటే ఇషాంత్ శర్మ పేరు టక్కున చెబుతారు. ఇషాంత్ శర్మ పొడవు 6 అడుగుల 5అంగుళాలు. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత పొడవైన క్రికెటర్లుగా మహ్మద్ ఇర్ఫాన్(పాకిస్తాన్), జోయల్ గార్నర్(వెస్టిండీస్), బ్రూస్ రీడ్(ఆస్ట్రేలియా), కర్ట్లీ ఆంబ్రోస్(వెస్టిండీస్), టామ్ మూడీ( ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), క్రిస్ ట్రెమ్లెట్( ఇంగ్లండ్), పీటర్ ఫుల్టన్(న్యూజిలాండ్), షాహిన్ ఆఫ్రది(పాకిస్తాన్), ఇషాంత్ శర్మ( ఇండియా) తొలి పది స్థానాల్లో ఉంటారు. -
‘నా పేస్ దెబ్బకు కోహ్లినే బిత్తర పోయాడు’
కరాచీ: భారత్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు గౌతం గంభీర్ తన కళ్లలోకి చూడాలంటే భయపడేవాడని కొన్ని రోజుల క్రితం పేర్కొన్న పాకిస్తాన్ వెటరన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్.. తాజాగా తన బౌలింగ్ చూసి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లినే బిత్తరపోయాడన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం భారత పర్యటనలో భాగంగా కోహ్లి తన బౌలింగ్‌ను చూసి ఆశ్చర్యపోయాడన్నాడు. ఈ మేరకు ఆనాటి జ్ఞాపకాల్ని పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్ సవేరా పాషాతో మహ్మద్ ఇర్ఫాన్ పంచుకున్నాడు. క్రిక్ కాస్ట్లో భాగంగా యూట్యూబ్ చాట్‌లో పలు విషయాల్ని తెలిపాడు. ఆ భారత పర్యటనలో తాను పెద్ద పేసర్‌ను కాదని భారత ఆటగాళ్లు అంచనా వేశారని, కాకపోతే తన బౌలింగ్‌లో వేగం చూసి అంతా ఆశ్చర్యపోయారన్నాడు. (ఎంఎస్ ధోనికి గ్రీన్ సిగ్నల్) ‘ నేను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు నన్ను తక్కువగా అంచనా వేశారు. భారత కోచ్‌లు నా బౌలింగ్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. నేను 130-135 కి.మీ వేగంతో బౌలింగ్ వేస్తానని భారత ఆటగాళ్లకి చెప్పారట. ఈ విషయాన్ని భారత క్రికెటర్లే నాకు చెప్పారు. కాకపోతే కోహ్లి ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయాడట. నేను 145-146 కి.మీ వేగంతో బౌలింగ్ వేయడం చూసి అతని పక్కనే ఉన్న కోచ్‌ను ప్రశ్నించాడట. ఇదే విషయాన్ని కోహ్లినే నాకు చెప్పాడు. ఇద్దరం ఎదురుపడినప్పుడు స్వయంగా కోహ్లినే నా బౌలింగ్‌ను ప్రశంసించాడు. నిన్ను మీడియం ఫాస్ట్ బౌలర్ అన్నారు. నువ్వేమో 150కి.మీ వేగంతో బౌలింగ్ వేస్తున్నావు అన్నాడు’ అని ఏడడుగుల ఒక అంగుళం ఎత్తు ఉండే మహ్మద్ ఇర్ఫాన్ తెలిపాడు.2017లో పీసీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఏడు అడుగులు పైగా ఉండే ఇర్ఫాన్.. 2012లో భారత పర్యటనకు వచ్చాడు. ఆ సిరీస్‌లో గౌతం గంభీర్‌ను నాలుగుసార్లు(వన్డేలు, టీ20లు) ఔట్ చేశాడు.(10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ) -
‘నేను కారు ప్రమాదంలో చనిపోలేదు’
కరాచీ: తాను కారు ప్రమాదంలో చనిపోయినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్న ఇర్ఫాన్.. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను ఎందుకు వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం మహ్మద్ ఇర్ఫాన్ ట్వీటర్లో పలు పోస్టింగ్‌లు వెలుగు చూశాయి. కారు ప్రమాదంలో ఇర్ఫాన్ మృతి చెందాడంటూ కొంతమంది ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్.. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. కొంతమంది కావాలని తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డాడు. (‘అతని వల్లే సచిన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’) అసలు ఇలా మరణించానంటూ ఎందుకు వైరల్ చేస్తున్నారో తనకైతే అర్థం కావడం లేదన్నాడు. ఇది తన కుటుంబాన్ని పూర్తిగా అయోమయానికి గురి చేయడమే కాకుండా తీవ్రంగా బాధించిందన్నాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి లెక్కనేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయన్నాడు. వారందరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, తాను, కుటుంబం క్షేమంగా ఉన్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఈ తరహా ఫేక్ న్యూస్‌ను వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే విషయం దాన్ని సృష్టించిన వారు తెలుసుకోవాలన్నాడు. 38 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్.. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తరఫున 4 టెస్టు, 60 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 10 వికెట్లు, వన్డేల్లో 83 వికెట్లు, టీ20ల్లో 16 వికెట్లను ఇర్పాన్ తీశాడు. 7 అడుగుల, 1 అంగుళం ఎత్తు ఇర్ఫాన్‌ది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఎత్తు కల్గిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. (సెంచరీ కొట్టకపోతే వేస్ట్!) -
‘నా కళ్లలోకి చూడాలంటే గంభీర్ భయపడేవాడు’
కరాచీ: దాదాపు ఏడేళ్ల నాటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నాడు పాకిస్తాన్ వెటరన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్. 2017లో పీసీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఏడు అడుగులు పైగా ఉండే ఇర్ఫాన్.. 2012లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో గౌతం గంభీర్‌ను ఎక్కువ సార్లు ఔట్ చేశాడు. ఆ సిరీస్‌లో భాగంగా వన్డేలు, టీ20ల్లో కలిపి గంభీర్‌ను నాలుగుసార్లు ఔట్ చేశాడు ఇర్ఫాన్. దీనిలో భాగంగా ఆనాటి విషయాల్ని మరోసారి షేర్ చేసుకున్నాడు. ‘నేను భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు ఆడినప్పుడు వారు నన్ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. నా ఎత్తు కారణంగా నేను వేసే బంతుల్ని సరిగా అంచనా వేయలేకపోయేవారు. అందులో గంభీర్ ఒకడు. గంభీర్ నా కళ్లలోకి చూడటాన్ని తప్పించుకునేవాడు. నా కళ్లలోకి నేరుగా చూడటానికి భయపడేవాడు. నా కారణంగానే అతని కెరీర్ ముగిసిందని అనుకుంటున్నా. మాతో భారత్‌లో జరిగిన ఆ సిరీస్ తర్వాత అతను జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. ఆపై గంభీర్ ఒకే సిరీస్ ఆడినట్లు నాకు గుర్తు. ప్రధానంగా నా ముఖంలో చూడటానికి గంభీర్ ఆసక్తి చూపేవాడు కాదు. రెండు జట్లు ప్రాక్టీస్ సెషన్లో ఉన్నప్పుడు కూడా నా కళ్లలోకి చూసేవాడు కాదు’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. -
టీ20ల్లో రికార్డు.. 4 ఓవర్లకు ఒకే పరుగు
సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్లో అద్భుతం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20 చరిత్రలోనే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన సెయింట్ కిట్స్Vs బార్బడోస్ ట్రైడెంట్స్ మ్యాచ్‌లో ఇర్ఫాన్ ఈ ఘనతను అందుకున్నాడు. అతడు వరుసగా వేసిన 23 బంతుల్లో ప్రత్యర్థులు ఒక్క పరుగు తీయకపోవడం గమనార్హం. చివరికి నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడు మెయిడెన్ ఓవర్లు ఉండటం విశేషం. అయితే ఇర్ఫాన్ ఇంత అద్భుతమైన బౌలింగ్ చేసినా.. తన టీమ్ బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బార్బడోస్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్.. 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. కెప్టెన్ జేస్ హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన సెయింట్ కిట్స్.. 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి బంతికే ఔటైనా.. బ్రాండన్ కింగ్ 49 బంతుల్లో 60 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమ్ ఓడినా ఇర్ఫాన్‌నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ ప్రదర్శన పట్ల ఇర్ఫాన్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకా సంతోషపడేవాడినని, అయినప్పటికి టీ20ల్లో ఓ అద్భుత స్పెల్ నమోదు చేయడం సంతృప్తినిచ్చిందన్నాడు. -
భారత కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ బౌలర్లు
సాక్షి, హైదరాబాద్: సమకాలీన క్రికెట్లో స్థిరత్వంతో రాణిస్తున్న విరాట్ కోహ్లిని పాకిస్థాన్ అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం పాక్ అభిమానులే కాకుండా ఆదేశ క్రికెటర్లు సైతం కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా పాక్ సీనియర్ బౌలర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్, యువ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్‌లు ట్విట్టర్ వేదికగా కోహ్లిని ఆకాశానికెత్తారు. కోహ్లి బౌలింగ్ చేయడమే ఓ గొప్ప అవకాశమని షోయబ్ ట్వీట్ చేయగా.. గొప్ప మనసున్న వ్యక్తి కోహ్లి అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. ‘కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బౌలింగ్ చేస్తే అన్ని బంతులు మంచిగా వేయలేనేమో.. కోహ్లి ఒక గొప్ప బ్యాట్స్‌మెన్, అతనికి బౌలింగ్ చేయడమే ఓ గొప్ప విశేషం’ -షోయబ్ అక్తర్ ‘కోహ్లి ఓ జెంటిల్మన్.. గొప్ప మనుసున్న గొప్ప ఆటగాడు. నీ కోసం ప్రార్ధిస్తా మై డియర్ ఫ్రెండ్. మనం మైదానంలో తరుచుగా ఆడుతామని ఆశిస్తున్నా’.- మహ్మద్ ఇర్ఫాన్ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న విరాట్.. ఈ ఇద్దరి క్రికెటర్లపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇర్ఫాన్ బౌలింగ్ ఎదుర్కోవడం ఓ చాలెంజ్. దానికి కారణం అతని ఎత్తే. షోయబ్ బౌలింగ్ ఎప్పుడు ఎదుర్కోలేదు. కానీ అతని బంతి ప్రాణంతకమైందని దంబుల్లా మ్యాచ్‌లో అర్థమైంది. ఆమ్యాచ్‌లో త్వరగా అవుటవ్వడంతో అతని బౌలింగ్ ఎదుర్కోలేదు. కానీ అతని బంతి బ్యాట్స్‌మన్‌కు తగిలితే అంతే సంగతి. అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్‌స్ట్రైక్ ఎండ్ లో ఉండటమే మంచిది’. అని కోహ్లి ఆ షోలో పేర్కొన్నాడు. What a gentleman @imVkohli is! Great player with a great heart. Prayers for you my friend. Hope that we play more often in grounds. #Respect https://t.co/ovKWuEM4TL — Mohammad Irfan (@M_IrfanOfficial) 6 November 2017 I was better off not bowling at all when #Kohli was batting.Jokes apart,he's a gr8 batsman & bowling agnst him wud have been a gr8 contest. pic.twitter.com/EHL32UpXrU — Shoaib Akhtar (@shoaib100mph) 4 November 2017 -
ఇర్ఫాన్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
కరాచీ:పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఇర్ఫాన్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఫిక్సింగ్ చేయమని బుకీలు సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఇర్ఫాన్ నిషేధానికి గురయ్యాడు. అయితే సస్పెన్షన్ మార్గదర్శకాలను పాటించిన నేపథ్యంలో ఇర్ఫాన్ పై ఉన్న నిషేధాన్ని ఏడాది నుంచి ఆరు నెలకు తగ్గిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే నెల్లో శ్రీలంకతో జరిగే ట్వంటీ 20 సిరీస్ కు ఇర్ఫాన్ అందుబాటులో ఉండనున్నాడు. పీఎస్ఎల్ రెండో ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ చేయమని బుకీలు అతన్ని సంప్రదించగా... ఆ విషయాన్ని బోర్డుకు చెప్పలేదు. నియమావళి ప్రకారం ఇలాంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయకపోతే చర్య తీసుకునేందుకు ఆస్కారముంటుంది. దాంతో ఇర్ఫాన్ పై నిషేధంతో పాటు రూ. 65 వేల జరిమానా విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. -
పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఇర్ఫాన్‌పై ఏడాది నిషేధం
పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం, రూ.65 వేల జరిమానా విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ చేయమని బుకీలు అతన్ని సంప్రదించగా... ఆ విషయాన్ని బోర్డుకు చెప్పలేదు. పీసీబీ నియమావళి ప్రకారం ఇలాంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయకపోతే చర్య తీసుకునేందుకు ఆస్కారముంటుంది. అయితే అతను మాత్రం ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని పీసీబీ స్పష్టం చేసింది. -
స్పాట్ ఫిక్సింగ్: పాకిస్థాన్ క్రికెటర్‌పై వేటు
కరాచీ: వివాదాలకు, అనిశ్చితికి పాకిస్థాన్ క్రికెట్ మారుపేరు. ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, కెప్టెన్‌గా ఎవరు ఉంటారో, ఎప్పుడెలా ఆడుతారో ఊహించడం కష్టం. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు షరా మామూలే. తాజాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు వేశారు. ఇర్ఫాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత పొడగరి అయిన ఫాస్ట్ బౌలర్‌గా ఇర్ఫాన్‌కు గుర్తింపు ఉంది. పాక్ తరఫున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 20 టి-20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇర్పాన్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ బుకీ అతన్ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక కమిటీ ముందు ఇర్ఫాన్ హాజరైనా సమాధానం ఇవ్వలేదు. అతని కుటుంబ సభ్యులు మరణించడంతో బాధలో ఉన్నట్టు సమాచారం. బుకీలతో సంబంధాలు, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి అతనిపై పీసీబీ ఛార్జిషీట్ నమోదు చేసి, సస్పెండ్ చేసింది. 14 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలపై మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్ కేసులోనే మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు. గతంలో ఇంకా పలువురు పాక్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. -
మరో ‘జేకేబీహెచ్’ ఉగ్రవాది అరెస్టు
కీలకంగా వ్యవహరించిన మహ్మద్ ఇర్ఫాన్ ♦ అప్రకటిత చీఫ్ యజ్దానీకి కుడిభుజం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘ఐసిస్’ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫ్ ఫీ బిలాద్ అల్ హింద్’(జేకేబీహెచ్) మాడ్యూల్లో మరో ఉగ్రవాది మహ్మద్ ఇర్ఫాన్ అరెస్టు అయ్యాడు. గత ఏడాది జూన్‌లోనే ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిం చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సరైన ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టాడు. తాజాగా సాంకేతిక ఆధారాలు లభించడంతో మంగళవారం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జేకేబీహెచ్ ఉగ్రవాదులనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు గత ఏడాది జూన్, జూలై నెలల్లో పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథవుర్ రెహ్మాన్, అబ్దుల్ బిన్ అహమద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత నెల్లో వీరిపై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. వాస్తవానికి ఈ మాడ్యూల్‌ను నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసేర్ అమీర్‌గా(చీఫ్) వ్యవ హరించాడు. అయితే పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం అప్రకటిత అధినేతగా కొనసాగాడు. పాత బస్తీలోని మీర్‌చౌక్ ఠాణా పరిధిలో ఉన్న మీరాలం మండి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఇప్ఫు ఇతడికి కుడిభుజంగా పని చేశాడు. పేరు మార్చుకుని... ఆన్లైన్ ద్వారా ఐసిస్ భారత చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఆకర్షితులైన జేకేబీహెచ్ ఉగ్రవాదులు ఖలిఫాగా (మతాధిపతి) ప్రకటించుకున్న ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ గత ఏడాది మే నెల్లో ఓ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలోనూ ఇర్ఫాన్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇర్ఫాన్ పేరును అబు జఫార్గా మార్చినట్లు యజ్దానీ ప్రకటించాడు. ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేఫ్ డెన్‌తో పాటు ఉగ్రవాద శిక్షణకు అనువైన ప్రాంతాలను గాలిం చడంతో ముఠా సభ్యులకు సహకరించాడు. నగర శివార్లలో ఉన్న నల్లగొండ జిల్లా పోచంపల్లి నుంచి ఈ మాడ్యుల్ పేలుడు పదార్థాలు సేకరించింది. మిగిలిన ముష్కరులతో కలిసి అక్కడకు వెళ్లిన ఇర్ఫాన్ వాటిని తీసుకువచ్చాడు. ఈ ఉగ్రదులు పేలుడు పదార్థాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ సంచరించారు. సెల్‌ఫోన్‌తో కీలక ఆధారాలు గతేడాది జూన్ 29న జేకేబీహెచ్ కుట్రను ఛేదిం చిన ఎన్ఐఏ అధికారులు మిగిలిన ఉగ్రవాదుల తో పాటు ఇర్ఫాన్‌ను విచారించారు. సరైన ఆధారాలు లేని కారణంగా ఇర్ఫాన్‌ను విడిచిపె ట్టారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నా రు. దీన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన ఎన్ఐఏ ఇటీవలే ఆ రిపోర్ట్‌ను పొందింది. ఇందులో జేకేబీహెచ్ మాడ్యూల్లో ఇర్ఫాన్ పాత్రకు సంబంధించి కీలక సాంకేతిక ఆధారాలు లభించాయి. దీంతో మంగళవారం ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతితో ఇర్ఫాన్‌ను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
ప్రపంచకప్ నుంచి ఇర్ఫాన్ అవుట్
అడిలైడ్: అతికష్టమ్మీద ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరిన పాకిస్తాన్ జట్టుకు నాకౌట్‌కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్ పొత్తికడుపు గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఏడడుగుల ఒక అంగుళం ఉండే ఇర్ఫాన్ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు సాధించాడు. పొత్తి కడుపులో చీలిక ఏర్పడినట్టు స్కానింగ్‌లో తేలిందని, దీంతో తను టోర్నీకి దూరమవుతున్నట్టు జట్టు ఫిజియోథెరపిస్ట్ బ్రాడ్ జాన్సన్ తెలిపారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరమైన ఇర్ఫాన్ స్థానంలో పాక్ ఎడమచేతి పేసర్ ఎహ్సాన్ ఆదిల్‌తో బరిలోకి దిగింది. జట్టు సెమీస్‌కు చేరితే అతడి స్థానంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. -
హారాల కోసమే హత్య
పక్షం రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో కారులో శవమై కనిపించిన నగల వ్యా పారి హత్య కేసులో మిస్టరీని హుమాయున్‌నగర్ పోలీసులు ఛేదించారు. అతని వద్ద పనిచేస్తున్న ఇద్దరు కమీషన్ ఏజెంట్లు రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను దోచుకునేందు కు ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్ర కారం...హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్మోయిన్ (35) ముంబై నుంచి బంగా రం, ముత్యాల హారాలను తీసుకొచ్చి నగరం లో విక్రయిస్తుంటాడు. ఇతని వద్ద మసాబ్‌ట్యాంక్‌కు చెంది న మహ్మద్ ఇర్ఫాన్ (22), సోమాజిగూడకు చెందిన సయ్యద్ జునైద్ అలీ (21)లు ఐదు నెలలుగా కమీషన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. నగలను అమ్మిపెట్టే క్రమంలో ఇర్ఫాన్, జునైద్‌లు మోయిన్‌కు రూ.1.80 లక్షలు బాకీ పడ్డారు. ఈ డబ్బును చెల్లించాలని మోయిన్ ఒత్తిడి చేస్తుండటంతో అతడ్ని హత్య చేయాలని ఇర్ఫాన్, జునైద్‌లు పథకం వేశారు. నగలు ఖరీ దు చేసేందుకు ఓ వినియోగదారుడు తమ వద్ద ఉన్నాడని, నగలు తీసుకుని బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని ఓ అపార్ట్‌మెంట్‌కు రావాల ని గతనెల 25న మోయిన్‌ను పిలిచారు. మ ద్యాహ్నం 2.45కి మోయిన్ రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను తీసుకుని ఇర్ఫాన్, జునైద్‌లు ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. మోయిన్ చేతిలో ఉన్న ముత్యాల హారాలను జునైద్ లాక్కోగా... ముఖంపై ఇర్ఫాన్ దుప్పటి కప్పి, సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. అదే రోజు రాత్రి హతుడు మోయిన్ కారులోనే శవాన్ని మహబూనగర్ జిల్లా రాయికల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపైకి తరలించారు. శవంతో పాటు కారును అక్కడే వదిలి, బస్సులో నగరానికి చేరుకున్నారు. మరుసటి రోజు మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. అప్పటికే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మోయిన్ అదృశ్యమైనట్టు హుమాయున్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. రాయకల్ గ్రామం వద్ద కారులో లభించిన శవం మోయిన్దేనని హుమాయున్‌నగర్ డీఐ జి.రాజు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. కారు ప్రయాణం చేసిన టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల మేరకు ఇర్ఫాన్, జు నైద్లను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేశామని వెల్లడించారు. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో మోయిన్ వద్ద కమీషన్ ఏజెంట్‌గా చేరామని, అయితే, ఆ శించినట్టు డబ్బు రాకపోవడంతో ఏకంగా మొత్తం నగలనే కాజేసేందుకు హత్య చేశామని అంగీకరించారు. విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ రామచంద్రన్ ఏసీపీ డి.శ్రీనివాస్, సీఐ ఎస్.రవీందర్ పాల్గొన్నారు.