ఇర్ఫాన్పై సస్పెన్షన్ ఎత్తివేత | Pakistan pacer Mohammad Irfan's suspension ends | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్పై సస్పెన్షన్ ఎత్తివేత

Published Fri, Sep 15 2017 12:57 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

ఇర్ఫాన్పై సస్పెన్షన్ ఎత్తివేత

ఇర్ఫాన్పై సస్పెన్షన్ ఎత్తివేత

కరాచీ:పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఇర్ఫాన్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఫిక్సింగ్ చేయమని బుకీలు సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఇర్ఫాన్  నిషేధానికి గురయ్యాడు. అయితే సస్పెన్షన్ మార్గదర్శకాలను పాటించిన నేపథ్యంలో ఇర్ఫాన్ పై ఉన్న నిషేధాన్ని ఏడాది నుంచి ఆరు నెలకు తగ్గిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే నెల్లో శ్రీలంకతో జరిగే ట్వంటీ 20 సిరీస్ కు ఇర్ఫాన్ అందుబాటులో ఉండనున్నాడు.

పీఎస్ఎల్ రెండో ఎడిషన్ లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయమని బుకీలు అతన్ని సంప్రదించగా... ఆ విషయాన్ని బోర్డుకు చెప్పలేదు. నియమావళి ప్రకారం ఇలాంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయకపోతే చర్య తీసుకునేందుకు ఆస్కారముంటుంది. దాంతో ఇర్ఫాన్ పై నిషేధంతో పాటు రూ. 65 వేల జరిమానా విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement