ముచ్చటగా మూడో క్రికెటర్‌.. పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్‌ రిటైర్మెంట్‌ | Mohammad Irfan Follows Amir And Imad Wasim | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడో క్రికెటర్‌.. పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్‌ రిటైర్మెంట్‌

Published Sun, Dec 15 2024 1:22 PM | Last Updated on Sun, Dec 15 2024 1:32 PM

Mohammad Irfan Follows Amir And Imad Wasim

పాకిస్తాన్ క్రికెట్‌లో రిటైర్మెంట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో పాకిస్తాన్‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన సహచరులు ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలలోపే ఇర్ఫాన్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. 

దీంతో 36 గంటల వ్యవధిలో రిటైరైన మూడో పాకిస్తాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించాడు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన  నా సహచరులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. 

పాకిస్తాన్ క్రికెట్‌తో నాకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని ఇర్ఫాన్ ఎక్స్‌లోరాసుకొచ్చాడు. ఇర్ఫాన్ 2010లో పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

4 టెస్టులు, 60 వన్డేలు, 22 టీ20ల్లో పాక్ జట్టుకు ఇర్ఫాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 86 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన  4.91 ఎకానమీ రేటుతో 83 వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్‌ చివరగా 2019లో పాక్‌ తరుపున ఆడాడు.
చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement