మరో ‘జేకేబీహెచ్’ ఉగ్రవాది అరెస్టు
కీలకంగా వ్యవహరించిన మహ్మద్ ఇర్ఫాన్
♦ అప్రకటిత చీఫ్ యజ్దానీకి కుడిభుజం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘ఐసిస్’ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫ్ ఫీ బిలాద్ అల్ హింద్’(జేకేబీహెచ్) మాడ్యూల్‌లో మరో ఉగ్రవాది మహ్మద్ ఇర్ఫాన్ అరెస్టు అయ్యాడు. గత ఏడాది జూన్‌లోనే ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిం చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సరైన ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టాడు. తాజాగా సాంకేతిక ఆధారాలు లభించడంతో మంగళవారం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జేకేబీహెచ్ ఉగ్రవాదులనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు గత ఏడాది జూన్, జూలై నెలల్లో పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథవుర్ రెహ్మాన్, అబ్దుల్ బిన్ అహమద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గత నెల్లో వీరిపై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. వాస్తవానికి ఈ మాడ్యూల్‌ను నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసేర్ అమీర్‌గా(చీఫ్) వ్యవ హరించాడు. అయితే పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం అప్రకటిత అధినేతగా కొనసాగాడు. పాత బస్తీలోని మీర్‌చౌక్ ఠాణా పరిధిలో ఉన్న మీరాలం మండి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఇప్ఫు ఇతడికి కుడిభుజంగా పని చేశాడు.
పేరు మార్చుకుని...
ఆన్‌లైన్ ద్వారా ఐసిస్ భారత చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఆకర్షితులైన జేకేబీహెచ్ ఉగ్రవాదులు ఖలిఫాగా (మతాధిపతి) ప్రకటించుకున్న ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ గత ఏడాది మే నెల్లో ఓ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలోనూ ఇర్ఫాన్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇర్ఫాన్ పేరును అబు జఫార్‌గా మార్చినట్లు యజ్దానీ ప్రకటించాడు. ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేఫ్ డెన్‌తో పాటు ఉగ్రవాద శిక్షణకు అనువైన ప్రాంతాలను గాలిం చడంతో ముఠా సభ్యులకు సహకరించాడు. నగర శివార్లలో ఉన్న నల్లగొండ జిల్లా పోచంపల్లి నుంచి ఈ మాడ్యుల్ పేలుడు పదార్థాలు సేకరించింది. మిగిలిన ముష్కరులతో కలిసి అక్కడకు వెళ్లిన ఇర్ఫాన్ వాటిని తీసుకువచ్చాడు. ఈ ఉగ్రదులు పేలుడు పదార్థాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ సంచరించారు.
సెల్‌ఫోన్‌తో కీలక ఆధారాలు
గతేడాది జూన్ 29న జేకేబీహెచ్ కుట్రను ఛేదిం చిన ఎన్‌ఐఏ అధికారులు మిగిలిన ఉగ్రవాదుల తో పాటు ఇర్ఫాన్‌ను విచారించారు. సరైన ఆధారాలు లేని కారణంగా ఇర్ఫాన్‌ను విడిచిపె ట్టారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నా రు. దీన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన ఎన్‌ఐఏ ఇటీవలే ఆ రిపోర్ట్‌ను పొందింది. ఇందులో జేకేబీహెచ్ మాడ్యూల్‌లో ఇర్ఫాన్ పాత్రకు సంబంధించి కీలక సాంకేతిక ఆధారాలు లభించాయి. దీంతో మంగళవారం ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఎన్‌ఐఏ అధికారులు కోర్టు అనుమతితో ఇర్ఫాన్‌ను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.