
ప్రపంచకప్ నుంచి ఇర్ఫాన్ అవుట్
అడిలైడ్: అతికష్టమ్మీద ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరిన పాకిస్తాన్ జట్టుకు నాకౌట్‌కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్ పొత్తికడుపు గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఏడడుగుల ఒక అంగుళం ఉండే ఇర్ఫాన్ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు సాధించాడు. పొత్తి కడుపులో చీలిక ఏర్పడినట్టు స్కానింగ్‌లో తేలిందని, దీంతో తను టోర్నీకి దూరమవుతున్నట్టు జట్టు ఫిజియోథెరపిస్ట్ బ్రాడ్ జాన్సన్ తెలిపారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరమైన ఇర్ఫాన్ స్థానంలో పాక్ ఎడమచేతి పేసర్ ఎహ్‌సాన్ ఆదిల్‌తో బరిలోకి దిగింది. జట్టు సెమీస్‌కు చేరితే అతడి స్థానంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది.