ఇర్ఫాన్‌ను అభినందిస్తున్న సహచరులు
సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్‌లో అద్భుతం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20 చరిత్రలోనే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన సెయింట్ కిట్స్Vs బార్బడోస్ ట్రైడెంట్స్ మ్యాచ్‌లో ఇర్ఫాన్ ఈ ఘనతను అందుకున్నాడు. అతడు వరుసగా వేసిన 23 బంతుల్లో ప్రత్యర్థులు ఒక్క పరుగు తీయకపోవడం గమనార్హం. చివరికి నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడు మెయిడెన్ ఓవర్లు ఉండటం విశేషం. అయితే ఇర్ఫాన్ ఇంత అద్భుతమైన బౌలింగ్ చేసినా.. తన టీమ్ బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో బార్బడోస్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్.. 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. కెప్టెన్ జేస్ హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన సెయింట్ కిట్స్.. 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి బంతికే ఔటైనా.. బ్రాండన్ కింగ్ 49 బంతుల్లో 60 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమ్ ఓడినా ఇర్ఫాన్‌నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ ప్రదర్శన పట్ల ఇర్ఫాన్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకా సంతోషపడేవాడినని, అయినప్పటికి టీ20ల్లో ఓ అద్భుత స్పెల్ నమోదు చేయడం సంతృప్తినిచ్చిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment