అఫ్రిది, షమీ కాదు.. అతడే నా ఫేవరెట్ బౌలర్: వసీం అక్రమ్‌ | Wasim Akram Picks 30-Year-Old Legend As Current Favourite Bowler | Sakshi
Sakshi News home page

అఫ్రిది, షమీ కాదు.. అతడే నా ఫేవరెట్ బౌలర్: వసీం అక్రమ్‌

Published Thu, Aug 15 2024 9:11 AM | Last Updated on Thu, Aug 15 2024 12:49 PM

Wasim Akram Picks 30-Year-Old Legend As Current Favourite Bowler

భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం తరంలో బుమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అని అక్రమ్ కొనియాడాడు. బుమ్రా టీమిండియాలో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 

వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా నెం1 జట్టుగా ఎదగడంలో బుమ్రాది కీలక పాత్ర. అంతేకాకుండా గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సైతం తన అద్బుత ప్రదర్శనతో బుమ్రా అందించాడు. తాజాగా అక్రమ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ బౌలర్ ఎవరన్న ప్రశ్న వసీంకు ఎదురైంది. వెంటనే అక్రమ్ ఏమీ ఆలోచించకుండా బుమ్రా పేరు చెప్పాడు.

వరల్డ్ క్రికెట్‌లో బుమ్రాని మించిన వారు లేరు. ప్రస్తుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందున్నాడ. అతడి బౌలింగ్ ఒక అద్భుతం. బంతితో అతడి కంట్రోల్ చేసే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

జస్ప్రీత్ బౌలింగ్‌లో ఎక్కువగా వేరియేషన్స్ ఉంటాయి. తన బౌలింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. కొత్త బంతితో కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. న్యూబాల్‌తో బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడి ఔట్‌స్వింగర్‌లను ఎదుర్కొవడం చాలా కష్టం​.

చాలా సార్లు నేను ఔట్‌స్వింగర్‌లను బౌలింగ్‌ చేసినప్పుడు నియంత్రణ కోల్పోయి పరుగులు ఇచ్చేవాడిని. కానీ బుమ్రా మాత్రం అలా కాదు. బంతితో పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. 

కొత్త బంతితో బుమ్రా నాకంటే బెటర్‌గా బుమ్రా బౌలింగ్‌ చేస్తున్నాడని అమ్రిక్‌క్రిక్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ పేర్కొన్నాడు. కాగా వసీం తమ జట్టు స్పీడ్‌ స్టార్‌ షాహీన్‌ అఫ్రిదిని తన అభిమాన బౌలర్‌గా ఎంచుకోకపోవడం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement