ఈతరం క్రికెటర్లలో బాబర్ ఆజం, విరాట్ కోహ్లిలు ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. అయితే కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి టాప్‌లోనే కొనసాగుతుండగా.. బాబర్ ఆజం మాత్రం కెరీర్ మొదట్లో తడబడినా.. ఆ తర్వాత తన మార్క్ చూపిస్తూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ ఇద్దరు తమ జట్లకు ఎన్నోసార్లు గెలిపించారు.
ఇప్పటికి కెప్టెన్‌గా బాబర్ ఆజం బెస్ట్ అనిపిస్తుంటే.. కోహ్లి తన కెప్టెన్సీ ఎరాలో టీమిండియాను నెంబర్‌వన్ చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజం.అయితే పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మాత్రం కోహ్లికే ఓటేశాడు. తన దృష్టిలో కోహ్లి ఒక్క విషయంలో బాబర్ ఆజం కంటే ఒక మెట్టు పైన ఉన్నాడని పేర్కొన్నాడు.
''కోహ్లి, బాబర్ ఆజంలు ఇద్దరు ఇద్దరే. ఒకరితో ఒకరిని పోల్చలేం. పాకిస్తాన్ తరపున బాబర్ నెంబర్‌వన్ అయితే.. టీమిండియా తరపున కోహ్లి నెంబర్‌వన్. వన్డేలు, టి20లు, టెస్టులు ఇలా ఏదైనా కావొచ్చు.. ఇద్దరు చాలాకాలం నెంబర్‌వన్ బ్యాటర్లుగా కొనసాగారు. అయితే ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లి ఔట్‌స్టాండింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. చాలా కాలంగా జట్టులో కొనసాగుతున్నాడంటే అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణం. వరల్డ్‌క్లాస్ ఫిట్‌నెస్ కలిగిన కోహ్లితో బాబర్ పోటీ పడలేడు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవాలంటే బాబర్ కాస్త ఎక్కువ కష్టపడాలి.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
Comments
Please login to add a commentAdd a comment