ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరొకసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ మతాన్ని ప్రస్తావించి విమర్శలపాలైన రజాక్.. తాజాగా పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ.. ‘నేను సంప్రాదయబద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నాను. అది కూడా ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. నాకు ఇది తప్పనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు.
ఇక అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగుతోంది. రజాక్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది.. ఈ రోజుతో అది పోయింది’, ‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని, షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని రజాక్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆడే రోజుల్లో వివాదాల జోలికి వెళ్లకుండా మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరుతెచ్చుకున్న రజాక్ గత కొద్ది రోజులగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment