WC Final: టీమిండియాకు మోదీ శుభాకాంక్షలు | PM Modi Wishes Team India Ahead Of WC Final | Sakshi
Sakshi News home page

WC Final: టీమిండియాకు మోదీ శుభాకాంక్షలు

Published Sun, Nov 19 2023 2:39 PM | Last Updated on Sun, Nov 19 2023 2:49 PM

PM Modi Wishes Team India Ahead Of WC Final - Sakshi

అహ్మదాబాద్‌: క్రికెట్ వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో నేడు భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. 140 కోట్ల మంది భారత్‌ టీంకు అండగా నిలబడతారని అన్నారు. 

అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. న్యూజిలాండ్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అటు.. సౌతాఫ్రికాపై గెలిచి ఆసిస్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది.    

ఇదీ చదవండి: భారత్‌ మ్యాచ్‌ గెలిస్తే చాట్‌ ఫ్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement