రణ్‌వీర్‌ సింగ్‌కు నోటీసులు.. | Ranveer Singh Gets Legal Notice From WWE Brock Lesnar | Sakshi
Sakshi News home page

రణ్‌వీర్‌ సింగ్‌కు నోటీసులు..

Published Fri, Jun 21 2019 9:44 PM | Last Updated on Fri, Jun 21 2019 10:23 PM

Ranveer Singh Gets Legal Notice From WWE  Brock Lesnar - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌కు లీగల్‌ నోటీసులు వచ్చాయి. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు  బ్రాక్ లెస్నర్, అతని లాయర్‌ పాల్ హేమాన్ ఈ నోటీసులను రణ్‌వీర్‌కి పంపించారు.  బ్రాక్ లెస్నర్కి చెందిన ఓ నినాదాన్ని ప్రపంచ కప్‌లో భాగంగా రణ్‌వీర్‌ ఉపయోగించింనందుకు వారు ఈ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. గత ఆదివారం ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌, పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రణ్‌వీర్‌ వీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌ హార్దిక్‌ పాండ్యాను అభినందిస్తూ.. తన ట్విట్టర్‌ ఖాతాలో ‘ ఈట్‌, స్లీప్‌, డామినేట్‌, రిపీట్‌ ’ అనే మేసేజ్‌తో  హార్ధిక్‌తో దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు.

దీనిపై పాల్‌ హేమాన్‌ స్పందిస్తూ.. ‘రణ్‌వీర్‌ ఉపయోగించిన నినాదం బ్రాక్ లెస్నర్దని.. ఆ నినాదంపై కాపీ రైట్‌ కూడా అతని వద్ద ఉందన్నారు. రణ్‌వీర్‌కు చట్టపరంగా నోటీసులను పంపుతున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement