రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే ! | Deepika Padukone and Ranveer Singh are relocate new home after parents | Sakshi
Sakshi News home page

Deepika Padukone: రూ.100 కోట్ల లగ్జరీ ఇంటికి దీపికా జంట.. కానీ ఆ తర్వాతే!

Published Thu, Aug 29 2024 11:01 AM | Last Updated on Thu, Aug 29 2024 12:50 PM

Deepika Padukone and Ranveer Singh are relocate new home after parents

బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. బేబీ బంప్‌తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.

రూ.100 కోట్లతో భవనం..

అయితే బాలీవుడ్‌ ఫేమస్‌ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ మన్నత్‌కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా  దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్‌వీర్‌ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.

దీపికా- రణ్‌వీర్‌ ప్రేమకథ..

2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్‌లో  కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్‌బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనుంది. సింగం ఎగైన్‌లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్‌ డాన్ 3లో కూడా నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement