గువహటి: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌కు సరైన సన్నాహకం లభించలేదు. వామప్ మ్యాచ్‌లను వరుసగా రెండో రోజూ వాన వెంటాడటంతో ఆట సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. రోజంతా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా వేసే అవకాశం లేకపోయింది. మ్యాచ్ ఆరంభానికి కాస్త ముందు పరిస్థితి మెరుగ్గా ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తర్వాత జోరందుకున్న వానతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.
నిజానికి ఇరు జట్ల ఆటగాళ్లు అధికారికంగా అంపైర్లు ప్రకటించక ముందే మైదానం వీడి హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ నెల 3న తిరువనంతపురంలో జరిగే తమ తర్వాతి వామప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. అయితే తాజా స్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్ నిర్వహణ కూడా సందేహంగానే ఉంది. వరల్డ్ కప్ అసలు సమరంలో ఈ నెల 8న చెన్నైలో ఆస్ట్రేలియాను టీమిండియా ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment