
కరాచీ: ప్రపంచకప్ దృష్ట్యా అన్నీ జట్లు టి20లు ఆడేందుకు తెగ సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో అసలు పాక్ గడపే తొక్కని ఇంగ్లండ్ కూడా పొట్టి ఫార్మాట్‌లో పెద్ద ముఖాముఖీ టోర్నీ ఆడేందుకు వచ్చింది. చివరిసారిగా 2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్ 17 ఏళ్ల తర్వాత ఏడు మ్యాచ్‌ల టి20ల సిరీస్ ఆడేందుకు ఇక్కడ అడుగుపెట్టింది.
మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెగ్యులర్ సారథి జోస్ బట్లర్ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండగా, మొయిన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 20, 22, 23, 25 తేదీల్లో కరాచీలో నాలుగు మ్యాచ్‌లు... 28, 30, అక్టోబర్ 2 తేదీల్లో లాహోర్ వేదికగా మూడు టి20లు జరుగనున్నాయి. బట్లర్ ఆఖరి దశ మ్యాచ్‌ల్లో ఒకట్రెండు ఆడే అవకాశముందని జట్టు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment