బాలీవుడ్‌లో బిగ్ బీ పేరున్న అమితాబ్ బచ్చన్ పేరు తెలియని వారు ఉండరు. దక్షిణాదిలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. వయసు పెరిగినా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా విషయం తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అయితే చూసేద్దాం పదండి.
(ఇది చదవండి: కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!)
వాటిని కూడా నమ్ముతారా?
ఇప్పుడున్న కాలంలో మూఢనమ్మకాలు నమ్మేవారు ఉంటారంటే నమ్ముతారా? పైగా సెలబ్రిటీలు అలాంటి వాటిని విశ్వసిస్తారా?అస్సలు ఛాన్సే లేదు. నేను కూడా వాటిని నమ్మను. కానీ మన బిగ్ బీకి ఉన్న మూఢనమ్మకం గురించి తెలిస్తే నిజంగానే షాకవుతారు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. ఇండియా మ్యాచ్ ఏదైనా సరే మిస్ కాకుండా చూడాల్సిందే. అలాంటి ఆ నమ్మకం వల్ల స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసేందుకు వెళ్లరట.
(ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!)
అంతలా క్రికెట్‌ను అభిమానించే అమితాబ్ బచ్చన్ స్టేడియం వెళ్లి క్రికెట్ చూడనే చూడరు. ఎందుకంటే ఆయన కేవలం ఇంట్లోనే ఉండి లైవ్ మ్యాచ్ చూస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన స్టేడియం వెళ్లి చూస్తే తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందట. ఒకటి, రెండుసార్లు అలా జరగడంతో ఇక బిగ్ బీ మొత్తానికే స్టేడియ వెళ్లడం మానేశారట. ఆరు నూరైనా సరే ఇంట్లో ఉండే టీవీలో చూస్తారట. మరీ ఇప్పుడు ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతోంది. మరీ ఈ మ్యాచ్‌లకైనా మూఢనమ్మకాన్ని పక్కనపెట్టి స్టేడియానికి వెళ్లి చూస్తారో లేదో? కొద్ది రోజులు వేచి చూద్దాం. అయినా సెలబ్రిటీలకు కూడా మూఢనమ్మకాలు ఉంటాయంటే నాలాంటి అభిమానులు నిజంగానే షాకవ్వాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment