
దుబాయ్: అంధుల వన్డే ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32 ఓవర్లలో అధిగమించింది. భారత ఓపెనర్ దీపక్ మాలిక్ (103 బంతుల్లో 179) అజేయ శతకంతో చెలరేగాడు.
ప్రకాశ్ జయరామయ్య 76 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. సురంగ సంపత్ (68), కేఏ సిల్వా (64) రాణించారు.