
దుబాయ్: మ్యాచ్ ఫిక్సర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కొరడా ఝుళిపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాజీ కెప్టెన్ మొహమ్మద్ నవీద్, అతని సహచరుడు షైమన్ అన్వర్‌లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. వీరిద్దరు 2019లో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఆరోపణలు రావడంతో అదే ఏడాది ఇద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఐసీసీ... తదుపరి అవినీతి నిరోధక శాఖ విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువరిచింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిద్దరు విచారణకు కూడా సహకరించకపోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది.
చదవండి:
అతడు ఎన్నిసార్లు విఫలమైనా ఛాన్స్.. కానీ పాపం
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’