దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ కేసుల్లో సహాయ నిరాకరణ, దర్యాప్తును అడ్డు కునేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. రెండేళ్ల పాటు అన్ని ఫార్మాట్లకు సంబంధించిన క్రికెట్ వ్యవహారాల్లో జయసూర్య పాల్గొనకూడదంటూ నిషేధం విధించింది. శ్రీలంక జాతీయ జట్టుకు సెలెక్టర్‌గానూ పనిచేసిన జయసూర్య హయాంలో ఆ దేశ క్రికెట్ బోర్డులో విపరీతమైన అవినీతి చోటు చేసుకుందని, అలాగే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు ఐసీసీ ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) ముందు హాజరుకాకపోవడంతో ఆర్టికల్ 2.4.6, ఆర్టికల్ 2.4.7ల ప్రకారం జయసూర్యపై రెండేళ్ల నిషేధం పడింది.
Comments
Please login to add a commentAdd a comment