ICC T20 World Cup India First Match: టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూ ల్‌ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే మరోసారి భారత అభిమానులుకు ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ వరల్డ్‌కప్‌లో కూడా ఒకే గ్రూపులో పాక్, భారత జట్లు ఉన్నాయి. దీంతో మరోసారి దాయాదుల పోరుకు టీ20 ప్రపంచకప్ వేదిక కానుంది. అక్టోబర్ 23న ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో తమ తొలిపోరులో భారత్ తలపడనుంది. కాగా టీ20 ప్రపంచకప్-2021 లీగ్ దశలో పాక్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే
టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మెల్‌బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-2లో టీమిండియా,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!
The fixtures for the ICC Men’s #T20WorldCup 2022 are here! 👇 pic.twitter.com/4ySJPOollF
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 21, 2022
Comments
Please login to add a commentAdd a comment