బ్యాటింగ్ కు దిగిన ఆసీస్
మొహాలి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆసీస్ ఓపెనర్లుగా ఖవాజా, ఆరోన్ ఫించ్ క్రీజులోకి వచ్చారు. పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తమ బౌలర్ మహ్మద్ ఆమీర్ చేతికి బంతి అందించాడు. ఇరు జట్లు ఒక్క మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్లతో ఉన్నాయి.
ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకమైంది. ముఖ్యంగా పాక్ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్ ఓడితే పాక్ ఇంటిదారి పట్టాల్సిందే. ఆసీస్ జట్టు ఈ ఆదివారం భారత్ తో మ్యాచ్ ఆడనుంది. కనుక ఈ జట్టుకు మరో అవకాశం ఉంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.