వికెట్లు పోతున్నా ఆసీస్ జోరు తగ్గలేదు
మొహాలి: పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (11 ), డేవిడ్ వార్నర్ (9), ఖవాజా (21) ఔటయ్యారు. వికెట్లు పడుతున్నా ఆసీస్ రన్ రేట్ 8కు తగ్గకుండా పరుగులు చేస్తుంది. వచ్చిన బాట్స్ మన్ వచ్చినట్టుగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్(22 పరుగులు), మాక్స్ వెల్(18) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇన్నింగ్స్ స్కోరు 42 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ (9 పరుగులు: 6 బంతుల్లో 2 ఫోర్లు)ను వాహబ్ రియాజ్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఖవాజా (21: 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ ) రియాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు, ఇమాద్ వసీం ఓ వికెట్ తీశాడు.